శనివారం, జులై 20, 2019

శ్రీ గౌరి శ్రీ గౌరియే...

విచిత్ర దాంపత్యం చిత్రం లోని ఒక చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం : అశ్వథ్ధామ   
సాహిత్యం : సి.నారాయణరెడ్డి     
గానం : సుశీల 

శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా 
 
శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే

సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి
సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి

పరమేశునికై తపియించి

పరమేశునికై తపియించి
ఆ హరు మేను సగమై పరవశించిన

శ్రీ గౌరి శ్రీ గౌరియే 
 
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి


సురలోకమున తాను ప్రభవించినా
తరళాత్మయైనది మందాకిని

ఒదిగి ఒదిగి పతి పదములందు
నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతి సిగను దూకి
నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి
చలిత జీవన తరంగ రంగ గంగ
ధవళాంశు కీర్తి గౌరి
నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన
భువనాంతమైన
క్షతి యెరుగని
మృతి యెరుగని నిజమిది
   
శ్రీ గౌరి శ్రీ గౌరియే
 శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే
 

శుక్రవారం, జులై 19, 2019

చిటాపటా చినుకులతో...

అక్కాచెల్లెలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, పి.సుశీల

చిటాపటా చినుకులతో
కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో
కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

తళాతళా మెరుపులతో
మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో
మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

వచ్చే వచ్చే వానజల్లు వచ్చే వచ్చే వానజల్లు
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది
వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది
నీ వేగమే ఇది

కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో
కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్ల ముసుగు కప్పుకున్నవి
నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్ల ముసుగు కప్పుకున్నవి
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

తళాతళా మెరుపులతో
మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

మెరిసె మెరిసె రెండు కళ్లు
మెరిసె మెరిసె రెండు కళ్లు
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి
సెలయేళ్లులే ఇవి

మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో
మెరిసింది పైన ఉరిమింది లోన
చిటాపటా చినుకులతో
కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో
 

గురువారం, జులై 18, 2019

నడకలు చూస్తే మనసౌతుంది...

సత్యం గారి స్వర సారధ్యంలో సినారె గారు రచించిన హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు

ఓ చక్కని చుక్కా...హే చక్కని చుక్కా
 
నడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ.. ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో.. లేత బంగారం

 
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు
ఒక కంట మంటలను మెరిపించు
ఒక కంట మంటలను మెరిపించు
కాని.. ఒక కంట మల్లెలను కురిపించు

ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... 
ఓయబ్బో.. ఏమి తలబిరుసు
ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... 
ఓయబ్బో.. ఏమి తలబిరుసు

నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో.. లేత బంగారం

 
ఊగి.. అటు సాగి.. ఒక నాగులాగ చెలరేగి
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి
ఊగి.. అటుసాగి.. ఒక నాగులాగ చెలరేగి
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి
ఈ పూట నన్ను ద్వేషించేవు
ఈ పూట నన్ను ద్వేషించేవు
కాని.. ఆపైన నన్నె ప్రేమించేవు

ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... 
ఓయబ్బో.. ఏమి ఆ మెరుపు
ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... 
ఓయబ్బో.. ఏమి ఆమెరుపు

నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం
ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం


బుధవారం, జులై 17, 2019

ఇరుసులేని బండి...

పాడిపంటలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాడిపంటలు (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఆ..  తొట్టిలో ఉన్నాడు జగమొండి
వాడి దూకుడికి ఆగలేరు తప్పుకోండి

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

వయసులోనె ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
వయసులోనె ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది

చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగినా నీకు హద్దులున్నవి
చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగినా నీకు హద్దులున్నవి

హద్దులన్ని సద్దులేని ముద్దులతో 
చెరిగిపోతవీ ఓయ్..
తందనా తనానాన తందనాన
తందనా తనానాన తందనాన 
          
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

ఎగిరెగిరిపడుతున్నాయ్ కోడెగిత్తలు
అవి ఏనాడు మోయలి మోపెడంతలు
ఎగిరెగిరిపడుతున్నాయ్ కోడెగిత్తలు
అవి ఏనాడు మోయలి మోపెడంతలు

ఎత్తుపల్లం చూస్తేనే ఇన్నిగంతులు
మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు
ఎత్తుపల్లం చూస్తేనే ఇన్నిగంతులు
మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు

పగ్గాలు లేనినాడు పంతాలు గెలవలేవూ.. హోయ్..
దసరిగరిసనిద దదద 
పనిసరిసని దప పపప
  
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

పచ్చని వరిచేను పరువంలో ఉన్నదీ
పైరగాలి తగలగానే పులకరించుచున్నది
పచ్చని వరిచేను పరువంలో ఉన్నది
పైరగాలి తగలగానే పులకరించుచున్నది

పులక పులకలో వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని కలలు గంటున్నది
పులక పులకలో వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని కలలు గంటున్నది

సంకురేత్రి పండుగకే సంబరాలు
కాసుకున్నవీ.. హోయ్‌..  
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి


మంగళవారం, జులై 16, 2019

అమ్మలగన్నా అమ్మల్లార...

ముహూర్త బలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముహూర్త బలం (1969)
సంగీతం : కె.వి.మహాదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.సుశీల   

అమ్మలగన్నా అమ్మల్లార
అక్షంతలను వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు
అమ్మా కొంచెం ఆగండి ఆగండీ

అమ్మలగన్నా అమ్మల్లార
అక్షంతలను వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు
అమ్మా కొంచెం ఆగండి ఆగండీ

ఆగం..ఆగం..ఆగం..హాస్యాలాడక
మానం..హాస్యాలాడక మానం

తలబిరుసు పెళ్ళికుమార్తె..మెడలే వంచదట
అవ్వవ్వ..అవ్వవ్వా..సిగ్గుబిడియం..అసలే లేవుసుమా
తాళిని కట్టించి ముకుతాడును..పొయ్యాలి..ఈఈఈ
తాళిని కట్టించి ముకుతాడును..పొయ్యాలి
మొగుడే రావాలీ..పొగరే తగ్గాలీ..ఈఈఈఈ
అవును అవును అవును..పొగరే తగ్గాలి..పొగరే తగ్గాలీ

అమ్మలగన్నా అమ్మల్లార
అక్షంతలను వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు
అమ్మా కొంచెం ఆగండి ఆగండీ

అసలైన మరదళ్ళంటే..అల్లరి బాజాలు
మురిపాల పరాసికాలు..ముళ్ళ రోజాలు
సందడి చేయాలీ..సరదా పండాలి..ఈఈఈఈ
సందడి చేయాలీ..సరదా పండాలి
పందిట్లో అమ్మాయి..భరతం పట్టాలీ..ఈఈఈఈ
అవును అవును అవును..
భరతం పట్టాలీ భరతం పట్టాలీ

గయ్యాళి నోటికి..తాళం టక్కున వేయాలి
తీరైన బుగ్గలు చిదిమి..దీపం పెట్టాలి
సిగ్గులు చిందాలీ..చిలిపిగ నవ్వాలీ..ఈఈఈఈ
సిగ్గులు చిందాలీ..చిలిపిగ నవ్వాలీ
అందానికి దిష్టి తీసి..హారతి ఇవ్వాలీ..ఈఈఈఈ
అవును అవును అవును
హరతీ ఇవ్వాలి హారతీ ఇవ్వాలి

అమ్మలగన్నా అమ్మల్లార
అక్షంతలను వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు
అమ్మా కొంచెం ఆగండి ఆగండీ
 

సోమవారం, జులై 15, 2019

తెలుగు వారి పెళ్లి...

శ్రావణమాసం చిత్రంలోని ఒక చక్కని పెళ్ళిపాటతో ఈ సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ చూడవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రావణమాసం (1991)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : వెనిగళ్ళ రాంబాబు
గానం : బాలు, మాళవిక 

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

ఒకరికి ఒకరని అనుకుంటే
అదే నిశ్చితార్థం
ఆ నిర్ణయానికీ తలవంచడమే
పెళ్ళి అంతరార్థం
శతమానం భవతి అంటూంది
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం


తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి


మంగళకరమే బంగారం
నిత్యము శక్తిమయం
అది మాంగళ్యంగా ముడి పడితే
తరించును స్త్రీ హృదయం
తాళిబొట్టులో రెండు పుస్తెలు
లక్ష్మీ పార్వతులూ..
అవి పుట్టినింటికీ మెట్టెనింటికీ
పట్టిన హారతులూ..

ఆ సంగతులన్నీ చెబుతుంది
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి


నవగ్రహాలకు ప్రతిరూపాలే
ఈ నవధాన్యాలూ
ఆ చంద్రుని ధాన్యం బియ్యమే
కదా పెళ్ళి తలంబ్రాలు
మనువుకు మూలం మనసైతే
ఆ మనసుకు చంద్రుడు అధిపతి
మీ అనుభంధంతో బియ్యం పొందెను
అక్షింతలుగా ఆకృతి

ఆ వేడుకలన్నీ చూడాలందీ
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి 

ఒకే కలపతో ఒకే పలకగా
పెళ్ళి పీట ఉందీ
అదీ ఒకే ప్రాణమై దంపతులిద్దరు
ఉండాలంటుందీ

చాలీ చాలని ఆ పీటా సన్నగ ఉంటుంది
అది సర్దుకు పోయే మనసుండాలని
జంటకు చెబుతుంది

ఆ సందేశాలను అందిస్తుంది
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి
 

ఆదివారం, జులై 14, 2019

నీ కోల కళ్ళకు...

హేమాహేమీలు చిత్రం కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఒక అందమైన ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హేమా హేమీలు (1979)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపులకు అభివందనాలు

కోటేరు లాంటి ఆ కొస ముక్కు
పొద్దు నిద్దర లేచినట్లు ఆ బొట్టు
మిసమిసలు పసిగట్టీ కసిపట్టి బుసగొట్టే
పడగెత్తు పైటున్న ఆ చీరకట్టు
జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు
 
జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు 
విడిచి పెడితే పెట్టు నా మీద ఒట్టు

నీ కొంటె కవితకు నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు
ఈ ఆప సోపాలకు ఆ విరహ తాపాలకు
ఈ ఆప సోపాలకు ఆ విరహ తాపాలకు
అందించనా నేను సుస్వాగతాలు

నీ కొంటె కవితకు నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు


నీ వలపే ఉసి గొలుపు 
నా చెలిమే చెయిగలుపు
పొలిమేరలో పిలుపు పులకింతలే రేపు
జడలోని మల్లికలు జవరాలి అల్లికలు
చలిపెంచే కోరికలు జాబిలితో కలయికలు
ఈ ఆరుబయట అందాల అల్లరులు  
ఈ పుట నాలో పలికించే కిన్నెరలూ
కలిసిపోనా ఏరు నీరై 
నేనింక నీవై నీవింక నేనై

నీ కోల కళ్ళకు నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు 

శనివారం, జులై 13, 2019

తోటలోకి రాకురా...

బుద్ధిమంతుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : సుశీల

తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా 
గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది
అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది

తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా 
గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది
అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

కన్ను సైగ చేయకురా
కామినీ చోరా గోపికాజారా
కన్ను సైగ చేయకురా
కామినీ చోరా గోపికాజారా
మా రాధ అనురాగం మారనిది
అది ఏ రాసకేళిలోన చేరనిది

తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

జిలుగు పైట లాగకురా
జిలుగు పైట లాగకురా
తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా
జిలుగు పైట లాగకురా
తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది

తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ

రోజు దాటి పోగానే..
జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే..
జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..

తోటలోకి రాకురా
తుంటరి తుమ్మెదా
గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది
అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

శుక్రవారం, జులై 12, 2019

దోర వయసు చిన్నది...

దేవుడు చేసిన మనుషులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాశరధి 
గానం : బాలు, సుశీల

ఏయ్..
అబ్బో..

దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది
కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది
కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరలలహ.. అహా..
అహా..

ఏయ్.. ఒళ్ళు ఎలా ఉంది?
ఒళ్ళా?

ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...
ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే
ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...
ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే
ఊఁహూఁ.. ఉంటది.. ఒక్కటిస్తే..
గూబ గుయ్... అంటది
ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసుకో
ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో..
ఛీ..పో..
అబ్బో..

దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది
కవ్విస్తూ ఉన్నదీ.. 
దోర వయసు చిన్నది.. లరలలహ..

అహా.. అహా.. ఒహో

ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే
ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే
అహాఁ.. అలాగా?
అలాగిలా అనుకోకు అందరిలా నన్నూ
చెఢామఢా పేలావో చెరిగేస్తా చూడు
అబ్బో... నిజంగా...
యే తారలోను నీ తీరు లేదు
యే పువ్వులోను నీ నవ్వు లేదు..
 
దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది
కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరలలహ..
 

గురువారం, జులై 11, 2019

ఏం పిల్లో తత్తర బిత్తర...

ఆత్మీయులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : పిఠాపురం నాగేశ్వరరావు

ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు
ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు
చిలిపి నవ్వులతో కవ్వించు మోము
చిన్నబోయింది ఈనాడదేమో

ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు


అందనికొమ్మలకు నిచ్చెనలేశావు
అందనికొమ్మలకు నిచ్చెనలేశావు
అయ్యో! గాలిలోన మేడలు కట్టావు
వలచిన పేదవాణ్ణి చులకన చేశావు
బులుపేగానీ వలపేలేనీ
టక్కరివాళ్ళ నమ్మి చిక్కులపాలైనావు

ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు
  
నీ వయ్యారపు వాలు చూపులతో
ముసలివాణ్ణి వూరిస్తున్నావు
నీ వయ్యారపు వాలు చూపులతో
ముసలివాణ్ణి వూరిస్తున్నావు
పడుచువాణ్ణి చేసేస్తున్నావు
బంగరు బొమ్మా పలుకవటమ్మా
మోజు దీర్చవే ముద్దులగుమ్మా

ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు
 
నీపై కన్నేసి వేషాలేశాను
నీపై కన్నేసి వేషాలేశాను
మెత్తని నీ మనసు గాయం చేశాను
చేసిన తప్పులకు చెంపలేసుకుంటాను
నువు దయజూపితే నను పెళ్ళాడితే
నిందలు వేసినాళ్ళ నోళ్ళు బందు చేస్తాను

ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.