సోమవారం, జులై 10, 2017

గాల్లో తేలినట్టుందే...

జల్సా సినిమాలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జల్సా (2008)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : దేవీశ్రీప్రసాద్, టిప్పు, గోపికా పూర్ణిమ

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

హే నిదుర దాటి కలలే పొంగే
పెదవి దాటి పిలుపే పొంగే
అదుపు దాటి మనసే పొంగే...నాలో
గడపదాటి వలపే పొంగే
చెంపదాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే....నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
 
తలపుదాటి తనువే పొంగే
సిగ్గుదాటి చనువే పొంగే
గట్టుదాటి వయసే పొంగే లోలో
కనులుదాటి చూపే పొంగే
అడుగుదాటి పరుగే పొంగే
హద్దు దాటి హాయే పొంగే..నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి

 

ఆదివారం, జులై 09, 2017

చలి గాలి చూద్దు...

జెంటిల్మెన్ చిత్రం లోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జెంటిల్మన్ (2016)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిచరణ్, పద్మలత, మాళవిక

చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
పొగమంచు చూద్దు మహ మంచిది
తెరచాటు కడుతున్నది
నన నన్నాన నన్నాన కద ఏమిటి
నన నన్నాన నన్నాన తెలుసా మరీ
ఇక ఈపైన కానున్న కద ఏమిటి
అది నీకైన నాకైన తెలుసా మరి
అయినా వయసిక ఆగేనా
మనమిక మోమాట పడకూడదంటున్నది

చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
పొగమంచు చూద్దు మహ మంచిది
తెరచాటు కడుతున్నది

ఎటు పోతున్నాం అని అడిగామా
ఎదురుగ వచ్చే దారేదైనా
ఏమైపోతాం అనుకున్నామా
జత పరుగుల్లో ఏం జరిగినా
శ్రుతి మించే సరాగం ఏమన్నది
మనమిక మోమాటపడకూడదంటున్నది

చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
పొగమంచు చూద్దు మహ మంచిది
తెరచాటు కడుతున్నది

కలతే ఐనా కిలకిలమనదా
మన నవ్వులలో తానూ చేరి
నడిరేయైనా విలవిలమనదా
నిలువున నిమిరే ఈడావిరి
మతి పోయేంత మైకం ఏమన్నది
మనమిక మోమాటపడకూడదంటున్నది

పొగమంచు చూద్దు మహ మంచిది
తెరచాటు కడుతున్నది
చలి గాలి చూద్దు తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
 

శనివారం, జులై 08, 2017

ఈ గాలిలో...ఓఓ...

అగ్నిపర్వతం చిత్రంలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అగ్ని పర్వతం (1985)
సంగీతం :  చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ
ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..
ఎక్కడో అలికిడి...స్స్..హా… అక్కడే అలజడి..మ్మ్..హా..
మత్తుగా తడబడి...  మెత్తగా జతబడి
పెట్టెను కౌగిలి ఒక వంకా...  పెట్టెను చెక్కిలి నెలవంక
ఏమౌతదో ఏమిటో...ఓ... ఓ...

ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ…
ఈ గాలిలో...ఓ..ఓ..ఓ..ఓ..
ఎక్కడో అలికిడి అక్కడే అలజడి
మత్తుగా తడబడి... మెత్తగా జతబడి
చెక్కిలిగుంటలు ఒకవంకా... చక్కిలిగింతలు ఒక వంక
ఈ కాస్తకే ఎందుకో...

ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...

నవ్విన వేళ మధుమాసంలా విరబూసే నా కోర్కేలే…
పువ్వూ నేను పుట్టిన నాడే వాలాము నీ పక్కనే…
వేసవి వడిలో వెన్నెల తడిలా
తనువులు కలిపే పెదవుల పొడిలో
ఈ ప్రేమ పందిళ్ళలో...ఓ..ఓ..

ఈ గాలిలో..ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ
ఈ గాలిలో...ఓ...ఓ...ఓ
ఎక్కడో అలికిడి.. హా.. హా..అక్కడే అలజడి..హా..హా..
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
పట్టెను కౌగిలి ఒక వంక..హా..
మెట్టెను చెక్కిలి నెలవంక
ఈ కాస్తకే.. ఎందుకో..ఓ...ఓ..

ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ
లలలల లలలల..లలలల లలలల..లలల లలలా లలల..

తాకిన చోటా తాంబూలంలా ఎరుపెక్కె నీ చెక్కిలీ
పొద్దూ ముద్దూ పుట్టే చోట...  ఎరుపెక్కవా దిక్కులే..
ఎద చలి పెరిగీ ఎదరకు జరిగే
కథ ఇక మొదలై కౌగిట బిగిసే
ఈ సందె సయ్యాటలో..ఓ..ఓ..

ఈ గాలిలో...ఓఓ...ఓఓ...ఓఓ...ఓఓ… ఓ...ఓ...ఓ
ఈ గాలిలో..ఓ..ఓ..ఓ..ఓ
ఎక్కడో అలికిడి..హా..హా..అక్కడే అలజడి..హా..హా..
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
పట్టెను కౌగిలి ఒక వంక..పెట్టెను చెక్కిలి నెలవంక
ఈ కాస్తకే ఎందుకో..ఓ...ఓ..ఓ..


శుక్రవారం, జులై 07, 2017

ప్రణయానికి పుట్టినరోజు...

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఒక నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఝూన్సీరాణి చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఝూన్సీరాణి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నా జీవిత ఆకాశంలో
ధృవతార నవ్విన వేళ
శతకోటి తారలు దీపాలై
శతమానం భవతి అన్నాయి

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు
ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు

నీకోసం వాకిట నిలచి
నా ఆశలు దోసిట నింపి
నిలుచున్నా నీవొస్తావనీ దీవిస్తావనీ
నా ప్రేమనీ ఓ ఆమని

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు 
 
తోడు లేని తోటలోకి దేవతలా వచ్చావు
నీడలేని జీవితాన హారతిలా వెలిగావు
వేణువంటి సోయగాన ప్రాణ వాయువైనావు
ప్రశ్నలాంటి యవ్వనాన బదులు నీవు ఐనావు
నాకోసం నిన్నే వలచి నీకోసం నన్నే మరచి
నిలుచున్నా నీవొస్తావని ప్రేమిస్తావని
ఈ జీవిని ఓ భామిని

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు

స్వాతి వాన జల్లులాగా లేత చెలిమి జల్లావు
చెలిమికన్నా చల్లనైన చేయి నీవు కలిపావు
నెమలికన్ను లాంటి నాకు కంటిపాపవైనావు
చంటి పాప లాంటి నాకు జోలపాటవైనావు
నా అందం కన్నులు తెరచి 
అనుబంధం ఆశలు పరచి
అనుకున్నా కలిసొస్తావని మనసిస్తావని
ఈ ప్రేమకి నీ ప్రేమకి

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు
నీకోసం వాకిట నిలచి
నా ఆశలు దోసిట నింపి
నిలుచున్నా నీవొస్తావనీ దీవిస్తావనీ
నా ప్రేమనీ ఓ ఆమని


 

గురువారం, జులై 06, 2017

గాలీ చిరుగాలీ...

వసంతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వసంతం (2003)
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.ఎస్.చిత్ర

గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదని

కనురెప్ప మూసి ఉన్న నిదరొప్పుకోను అన్న
నిను నిలువరించినా ఓ స్వప్నమా
అమావాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచిన ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ
పోల్చదు నేలమ్మా
ఉలి గాయం చేయకపోతే
ఈ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా
గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరదా...

గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా

చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపినా వాసంతమా
ఏ కొండ రాళ్లైనా ఏ కోన ముళ్లైనా
బెదిరేనా నీ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలుసుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను
ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా
నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా...

గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదని

బుధవారం, జులై 05, 2017

వీచే గాలీ మాలో...

ఆకాశమంత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆకాశమంత (2009)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సాధనా సర్గమ్

వీచే గాలీ మాలో ఉల్లాసాలే నింపే
పూచే పూవే మాతో చేరి
చిందించింది తేనెలే
తుళ్ళే మేఘం జల్లై మోగే
సంతోషాలా వెల్లువై

వీచే గాలీ మాలో ఉల్లాసాలే నింపే

ఒకటయ్యాకా మనసులు రెండూ
వయసుని ఇంకా ఆపాలా
కలిసాయెపుడో కన్నులు రెండూ
కలలకి ఇంకా అదుపేలా
కాలం మాపై జంట పయనం సాగునట
ప్రేమే తోవై జన్మ తీరము చేర్చునట
ఇది సరికాదు అనలేరు ఇంకెవ్వరూ

వీచే గాలీ మాలో ఉల్లాసాలే నింపే

వొంపులు తిరిగే నదిలో అందం
చెరువులలోనా ఉంటుందా
వలపులు నిండే బతుకున అందం
ఒంటరి తనమే ఇస్తుందా
నీతో పాటూ ఈ లోకం రాదుకదా
లోకం వెంటే నువు వెళితే హాయికదా
నీ సంతోషం నీ చేతిలోదే కదా
 

మంగళవారం, జులై 04, 2017

ఈ గాలి ఈ నేల...

సిరివెన్నెల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్ళు
ననుగన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్ళు 
ఈ గాలీ ఈ నేలా

చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిశాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిశాక వచ్చేను నా వంక
ఎన్నాళ్లో గడిచాకా ఇన్నాళ్లకు కలిశాక
ఎన్నాళ్లో గడిచాకా ఇన్నాళ్లకు కలిశాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాక
ఎగసేను నింగి దాకా….

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్లు ఆఆఆ.. నా కళ్ల లోగిళ్ళు
ఈ గాలీ... ఈ నేలా... 
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథలు
ఈ రాళ్లే జవరాళ్లై ఇట నాట్యాలాడేను
ఈ రాళ్లే జవరాళ్లై ఇట నాట్యాలాడేను

కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగన గళము నుండి అమర గాన వాహినీ 
ఆఆఆఆఆ...ఆఆఅ..ఆఆ..
గగన గళము నుండి అమర గాన వాహినీ
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి
అమృతవర్షిణి అమృతవర్షిణి…
ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళి లో నా హృదయమే
స్వరములుగా మారే

ఆహాహ..ఆహాఆ...
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా


సోమవారం, జులై 03, 2017

చిరుగాలి వీచెనే...

శివపుత్రుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 



చిత్రం : శివపుత్రుడు (2004)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వనమాలి
గానం : ఆర్పీ.పట్నాయక్, సునీత

చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..


కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే

చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే 


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..

తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ.. బంధమంతా వెల్లువైనదీ.. లోగిలంతా

పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బ్రతుకులో
కలిసిన బంధం. కరిగిపోదులే.
మురళి మోవి విరిని తావి కలిసిన వేళా... 


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే.. 

ఓ... మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకుబెళుకా ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట కోవెల వడి చేరేనా
రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది

రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ. తోడు లేకనే .
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే...

కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసినే..
తనవారి పిలుపులో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే

చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే...


ఆదివారం, జులై 02, 2017

గాలిగో.. గాలిగో...

శాంత్రి క్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :శాంతి క్రాంతి (1991)
సంగీతం : హంసలేఖ 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి

గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో 
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో
ఓ ప్రియురాలా నా ఊపిరందుకో 
పరువముతో పరిచయమే పరిమళమై
వేసవిగాలుల్లో వెన్ను కాచుకో 
ముసురుకునే విరహములే ఉసురుసురై

గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో

చిలిపిగా జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరం 
వలపులో జతులనే పలుకు కీర్తనకు నువ్వే స్వరం 
తపనలు గని రెప రెపమనే నీ పైటలో నీ పాటలో 

జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో 
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో 
శ్రావణ సంధ్యల్లో సంధి చేసుకో 
సరసమనే సమరములో వర్షములో 
ఓ ప్రియురాల నీ వెల్లువిచ్చుకో 
ఉరవడులే కలబడిన చలి ఒడిలో 

జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో 
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో
 
మనసనే మడుగులో సుడులు రేగినది నా జీవితం 
తడుపులో మెరుపులా తరలు ప్రేయసికి నా స్వాగతం
ఉరుముల సడి నడుమున పడే 
నీ వేటలో సయ్యాటలో

మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో 
ఓ ప్రియురాల నా దుప్పటందుకో 
వణుకులలో తొణికిన ఈ తళుకులలో
ఈ చలిమంటలలో చలికాచుకో 
సలసలతో కిల కిలలే కలబడగా 

మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో

హిమములా మహిమలో శ్రమను వీడినది నా జవ్వనం 
సుమములా చెలిమిలో సుఖము కోరినది నా జాతకం 
మిల మిల మనే మిణుగురులతో 
సాగిందిలే సాయంకాలమూ 

మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పంచుకో 



శనివారం, జులై 01, 2017

గాలికి కులమేది...

ఆషాఢమాసంలో వానలతో పాటు గాలులు కూడా అలరిస్తాయి కదా అందుకే ఈ జూలై నెలలో గాలిమీద వచ్చిన సినిమాపాటలను తలచుకుందాం. ముందుగా కర్ణ చిత్రంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కర్ణ (1963)
సంగీతం : విశ్వనాధన్ రామ్మూర్తి
సాహిత్యం : సినారె
గానం : సుశీల

గాలికి కులమేది?
గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేది
 
గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేది
గాలికి కులమేది?
 
మింటికి మరుగేది ఏదీ.ఈఈ. 
మింటికి మరుగేదీ..
ఏదీ కాంతికి నెలవేదీ..

గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేది? 

పాలకు ఒకటే...ఏ..ఏ...ఆఆఆ...ఆఆ 
పాలకు ఒకటే తెలివర్ణం
ఏదీ ప్రతిభకు కలదా స్థలబేధం
వీరుల కెందుకు కులబేధం
అది మనసుల చీల్చెడు మతబేధం

గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేదీ..ఈ...

జగమున యశమే..ఏఏఏ...
జగమున యశమే మిగులునులే
అది యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే

గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేది?


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.