సోమవారం, నవంబర్ 10, 2014

జగదీశ్వరా పాహి పరమేశ్వరా...

ఈ కార్తీక సోమవారం నాడు సువర్ణ సుందరి చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందామా. దేవకన్యలంతా ఆ జగదీశ్వరుని తమ నాట్యంతో అర్చించే ఈ పాట వినడానికీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సువర్ణసుందరి(1957)
సంగీతం : ఆదినారాయణరావ్
రచన : సముద్రాల
గానం : సుశీల, కోరస్

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..పాహి సురశేఖరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరి..వరసుందరా
గౌరి..వరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము..గంగాధరా
దేవ...గంగాధరా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

నడిపెను సుందర నటనకు జతులిడ
నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..


ఆదివారం, నవంబర్ 09, 2014

రాగాలు మేళవింప...

ఆయా రాగాల మహిమో లేక సంగీత సాహిత్యాల మహిమో లేక గాయనీ గాయకుల ప్రతిభో తెలియదు కానీ కొన్ని పాటలు వింటే హాయైన అనుభూతినిస్తుంది ఎంతటి అలసిన మనసునైనా సేద తీరుస్తాయి. అలాంటి పాటే పాండవ వనవాసం చిత్రంలోని ఈ "రాగాలు మేళవింప", మీరూ మరోసారి విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పాండవ వనవాసం (1965)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల

శశీ..కూ..శశీ..కూ..
ఓ...ఓ..ఓ..

రాగాలు మేళవింప..ఆహ!
హృదయాలు పరవశింప..ఓహొ!
ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ

రాగాలు మేళవింప..ఆహ!
హృదయాలు పరవశింప..
ఓహొ!
ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ

 
మురిపించు మల్లె తరమౌచు
నీదు ఉరమందు విరిసి పోయేనా
మురిపించు మల్లె తరమంచు
నీదు ఉరమందు విరిసి పోయేనా

విరితేనెలాను మధుపమ్మువోలె
నీ మేను మరచిపోయేనా

రాగాలు మేళవింప..
హృదయాలు పరవశింప..

ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ

ఆనందమొలుక నా డెందమందు
నిను దాచుకొందునో ఓ బాల
ఆనందమొలుక నా డెందమందు
నిను దాచుకొందునో ఓ బాల
నా కన్నుదొయి నీ రూపె నిలిపి
పూజించు కొందు బావ
 

రాగాలు మేళవింప..
హృదయాలు పరవశింప..

ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ


రాగాలు మేళవింప
హృదయాలు పరవశింప
ఆహ..ఆహా...ఆ..


శనివారం, నవంబర్ 08, 2014

కనులు కనులు కలిసే...

మణిరత్నం దర్శకత్వం వహించిన మొదటి చిత్రం "పల్లవి అనుపల్లవి" లోని ఒక చక్కని మెలోడి మీకోసం ఈరోజు. ఇందులో ఇళయరాజా గారి సంగీతం చాలా బాగుంటుంది. ఇదే ట్యూన్ ని ఆమధ్య ఐడియా కమర్షియల్స్ కి వాడుకున్నారు అలా ఈట్యూన్ బాగా ఫేమస్ అయిన విషయం మీకూ తెలిసే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పల్లవి అనుపల్లవి (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి

లలలా లలలా లలలా లలాలా
లలలా లలలా లలలా లలాలా
ఉహూహూ అహాహహా 
లలలలాలల లాలా

కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో.. వినిపించెను శ్రీ రాగం
కనులు కనులు.. కలిసే సమయం

మనసు మనసు.. చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము..
నీ చూపులో కురిసె శృంగారము
నీ మాటలో ఉంది మమకారము..
నా ప్రేమకే నీవు శ్రీకారము... 
పరువాలు పలికేను సంగీతము..
నయనాలు పాడేను నవ గీతము
నేనే నీకు కానా ప్రాణం.. నీవే నాకు కావా లోకం
 
కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం

నీ గుండె గుడిలో కొలువుండని..
నీ వెంట నీడల్లే నను సాగనీ 
నీ పూల ఒడిలో నను చేరని..
నీ నుదుట సింధూరమై నిలవని
చెవిలోన గుసగుసలు వినిపించని..
ఎదలోన మధురిమలు పండించని
నీలో నేనే కరగాలట.. రోజూ స్వర్గం చూడాలంట

కనులు కనులు.. కలిసే సమయం
మనసు మనసు.. చేసే స్నేహం
 
నీ చేరువలో నీ చేతలలో.. వినిపించెను శ్రీ రాగం
లలలా లలల.. లలలా లలల..
లలలా లలల.. లలలా లలల..


శుక్రవారం, నవంబర్ 07, 2014

ఉరికే చిలకా...

మణిరత్నం క్లాసిక్స్ లో ఒకటైన బోంబే సినిమాలోని ఈపాటలో వేటూరి గారి సాహిత్యం చాలా బాగుంటుంది  పాటలోనే ఒక చక్కని ప్రేమకథ చెప్పేస్తారు. తన సాహిత్యాన్ని ఏమాత్రం డామినేట్ చేయని చక్కని సంగీతం, హరిహరన్, చిత్ర ల గానం, సముద్రపు ఒడ్డున శిధిలమైన కోటలో ఆ పాటను చిత్రీకరించిన తీరూ అన్నీ అద్భుతమే. నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఎప్పటికీ చెరగని స్థానాన్ని సంపాదించుకున్న పాట ఇది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : బొంబాయి (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, చిత్ర

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ
 
 
కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

 
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
 
మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ


గురువారం, నవంబర్ 06, 2014

చీకటి వెలుగుల కౌగిటిలో...

చీకటి వెలుగులు సినిమా కోసం చక్రవర్తి గారి స్వరకల్పనలో దేవులపల్లి వారి రచన ఈ పాట... ఎంత బాగుంటుందో... ఈ కార్తీక పౌర్ణమి వేళ మనమూ ఆ వెన్నెలలో విహరించి వద్దామా... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చీకటి వెలుగులు (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ  
ఏకమైనా హృదయాలలో ఓ ఓ 
ఏకమైనా హృదయాలలో
పాకే బంగరు రంగులు..
 
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ  
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ.. 
చిక్కని ఈ అరుణ రాగాలూ 
అందీ అందని సత్యాలా.. 
సుందర మధుర స్వప్నాలా..

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా 
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ 
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మానూ పులకింప చేసీ
 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా

 
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ

 
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో 
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చీ పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలు.. 
ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ  
ష్.. గల గల మన కూడదూ ఆకులలో గాలీ
జల జల మనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ.. నిదరోయే కొలను నీరూ
కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా.. ఊపరాదూ

 
కొమ్మపైనిట జంట పూలూ
గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు..
చిక్కని ఈ అరుణ రాగాలూ
 
మరచిపోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలి 


బుధవారం, నవంబర్ 05, 2014

మనవే వినవా...

ఎనభైలలో వచ్చిన ఒక మంచి హాస్య చిత్రం "గోపాల్రావుగారి అమ్మాయి" లోని ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. చక్రవర్తి గారి సంగీతం చక్కని రిథమ్, క్లాసికల్, వెస్ట్రన్ ల మధ్య మారుతూ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందీ పాటలో. అలాగే వేటూరి గారి సాహిత్యం కూడా చక్కగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గోపాల్రావుగారి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : మాధవపెద్ది రమేష్, సుశీల

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..

మనవే విననా మనసే కననా
మది లోపలి మాటను మన్నించనా
గతమే మరచి కనులే తెరచి
నిజమైతే స్వామీ గుర్తించనా
ఇక ఒంటరి తనమే వదిలించనా..

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా

నిను చూడగనే నే బెంగపడి
సంపెంగలలో అది దాచుకుని
చిరునవ్వులకే మది జివ్వుమని
కసి చూపులతో కబురంపుకొని
పరుగులు తీసే పరువంతో
పైటలు జారే అందంతో
చక్కలిగిలిగా సరసాలాడే
చలి చలిగా సరిగమ పాడే
వలపులు పిలిచే ఈ వేళలో
వయసులు తెలిసే ఈ వేళలో

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
గతమే మరచి కనులే తెరచి
నిజమైతే స్వామీ గుర్తించనా
ఇక ఒంటరి తనమే ఒదిలించనా..

తొలిచూపులనే మునిమాపులుగా 
మరుమల్లెల జల్లులు జల్లుకుని 
బిగి కౌగిలినే నా లోగిలిగా 
అరముద్దుల ముగ్గులు పెట్టుకుని 
కలలైపోయిన కన్నులతో 
వలలైపోయిన చూపులతో 
ప్రేమే ముదిరీ పెళ్ళైపోయీ 
పెళ్ళే కుదిరీ ఇల్లైపోయే 
మనసులు కలిసే ఈ వేళలో 
మమతలు విరిసే ఈ వేళలో

మనవే విననా మనసే కననా
మది లోపలి మాటను మన్నించనా
గతమే మరచి కనులే తెరచి
నిజమైతే స్వామీ గుర్తించనా
ఇక వంటరి తనమే వదిలించనా..

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..


మంగళవారం, నవంబర్ 04, 2014

ఒక దేవుడి గుడిలో...

అక్కినేని గారి సినిమాల్లో నేను మర్చిపోలేనిదీ, ఎప్పుడు చూసినా ఈ సినిమా మొదటిసారి చూసినప్పటి చిన్నతనపు జ్ఞాపకాలలోకి తీసుకు వెళ్ళేదీ "ప్రేమాభిషేకం" సినిమా. ఇందులోని టైటిల్ సాంగ్ ఈ రోజు గుర్తు చేసుకుందామా. ఈ పాటలో చక్రవర్తి గారి సంగీతం భలే ఉంటుంది అలాగే దాసరి గారి చిత్రీకరణ కూడా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవత గుడిలో..  ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం...  కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

 
మరులు పూచిన పూలపందిరిలో..
మమతలల్లిన ప్రేమ సుందరికీ...
పట్టాభిషేకం... పట్టాభిషేకం
మనసు విరిచినా మనసు మరువనీ
మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం... మంత్రాభిషేకం

రాగాల సిగలో.. అనురాగాల గుడిలో...
భావాలబడిలో.. అనుభవాల ఒడిలో... 
వెలసిన రాగదేవతా... రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా... ప్రేమాభిషేకం 

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

 
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
 
 
ఒక దేవత గుడిలో..  ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం...  కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
 

కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ..
పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం
పాట మారినా ... పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి..
స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో...
బంగారు తోటలో.. రతనాల కొమ్మకు... 
విరిసిన స్వప్న సుందరీ...  క్షీరాభిషేకం...
కొలిచినప్రేమ పూజారీ.. అమృతాభిషేకం...
 
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

 
ఒక దేవత గుడిలో... ఒక దేవుడి ఒడిలో 
నిదురించే అనురాగం... కురిపించే అభిషేకం
 
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

సోమవారం, నవంబర్ 03, 2014

ఓం.. నమశ్శివాయ..

ఈరోజు కార్తీక సోమవారం, క్షీరాబ్ది ఏకాదశి కూడా.. మరి ఈ పర్వదినాన కాసేపు పరమశివుడ్ని తలచుకుందామా. ఇందులో వేటూరి గారి సాహిత్యం నాకు చాలా ఇష్టం ఆ సర్వేశ్వరుని గురించి ఎంతచక్కగా రాశారో అనిపిస్తుంది. అలాగే ఇందులో జానకి గారి గాత్రానికి గాయని శైలజ నర్తించడం ఒక విశేషం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : సాగరసంగమం (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి 
గానం : జానకి 
 
ఓం.. ఓం.. ఓం..
ఓం.. నమశ్శివాయ.. ఓం.. నమశ్శివాయ...
చంద్ర కళాధర సహృదయ...
చంద్ర కళాధర సహృదయ...
సాంద్రకళా పూర్ణోదయ.. లయ నిలయా...
ఓం...
ఓం... నమశ్శివాయ.. 
ఓం... నమశ్శివాయ...
పంచభూతములు ముఖ పంచకమై...
ఆఋ ఋతువులూ ఆహార్యములై...
పంచభూతములు ముఖ పంచకమై...
ఆఋ ఋతువులూ ఆహార్యములై...
ప్రకృతీ పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసప్తకమై
స గ మ ద ని స గ గ మ ద ని స గ మ
గగగ ససస ని గ మ గ స ని ద మ గ స 
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై -
నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా... ఆ...
నీ మౌనమే.. దశోపనిషత్తులై ఇల వెలయా...

ఓం...ఓం..
ఓం... నమశ్శివాయ...


త్రికాలములు నీ నేత్రత్రయమై..
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై..
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు..
నీ సంకల్పానికి ఋక్విజవరులై...
అద్వైతమే నీ ఆది యోగమై -
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జత్ర గాత్రముల శృతి కలయా...

ఓం.. ఓం..
ఓం... నమశ్శివాయ..
చంద్ర కళాధర సహృదయా...
సాంద్రకళా పూర్ణోదయా.. 
లయ నిలయా...


ఆదివారం, నవంబర్ 02, 2014

ఓ ప్రియా...

చండీప్రియ సినిమాలోని ఒక చక్కని యుగళ గీతం ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : చండీప్రియ (1980)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
 
తొలి గిలిగింతలు కలిగించిందా 
నా ప్రేమలేఖా.. నడిచే చంద్రరేఖ

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది
నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రరేఖ

మనసులో... ప్రతి మలుపులో..
నిను మలుచుకున్నానులే
కలలో... మధువనులలో..
నీ పిలుపు విన్నానులే
 
మనసులో... ప్రతి మలుపులో..
నిను మలుచుకున్నానులే
కలలో... మధువనులలో..
నీ పిలుపు విన్నానులే
 
ఆ చెలియ రూపాల చేరుకున్నావా
పలికే రాగరేఖ..
కలా?
నిజం..నిజం?
మ్మ్..

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా 
తొలి గిలిగింతలు కలిగించింది
నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రరేఖ

ఎవ్వతే నీ ఎవ్వాతే
ఒలికించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే ..
కురిపించుతావు సెగలు
ఆశను ..జీవితాశను..
నే చెదిరితే విషాదం
చండిని .. అపర చండిని
నను కదిపితే ప్రమాదం

నీవు నా కైపు.. తాను
నా వైపు అయ్యో ఏమి రాత..
అటా?
ఇటూ...
ఏటు?
ఇటూ ..

ఓ ప్రియా... ప్రియా
చండీప్రియా... ప్రియా
 
తొలి గిలిగింతలు కలిగించిందా 
నా ప్రేమలేఖా.. నడిచే చంద్రరేఖ
తొలి గిలిగింతలు కలిగించింది
నీ ప్రేమలేఖా.. నీదే ఈ చంద్రరేఖ


శనివారం, నవంబర్ 01, 2014

హిమగిరి సొగసులు...

పాండవవనవాసం సినిమాలోని ఈ పాట చాలా మందికి తెలిసే ఉంటుంది కదా.. మొదట్లో పాట ఆపగానే వచ్చే "ఆపావే పాడు" అనే బిట్ బోలెడంత ఫేమస్ కదా... మా కాలేజ్ రోజుల్లో ఎవరన్నా పాడుతూ పాడుతూ మధ్యలో ఆపితే ఇదే మాడ్యులేషన్ తో అంటూ ఆటపట్టించేవాళ్ళం మేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పాండవ వనవాసం (1965)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల

అ..అ..అ..అ...అ..అ..అ..
హిమగిరి సొగసులు....
మురిపించును మనసులు..
 
హిమగిరి సొగసులు....
హ్మ్.. ఆపావే పాడు... 

హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
 హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
చిగురించునేవో ఏవో ఊహలు...
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..

యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ....
అ..అ..అ..అ...అ..అ..అ..
యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ....
సురవరులు సరాగాల చెలుల
అ..అ..అ..అ...అ..అ..అ..
సురవరులు సరాగాల చెలుల 
కలిసి, సొలిసే అనురాగసీమ...

హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..

ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించేనేమో.... 
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
ఈ గిరినే ఉమాదేవి హరుని 
సేవించి తరించెనేమో..
సుమశరుడు రతీదేవి జేరి,
అ అ అ అ అ అ అ ఆ 
సుమశరుడు రతీదేవి జేరి...
కేళీ... తేలి... లాలించెనేమో...

హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
మ్మ్మ్..మ్మ్మ్...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.