మంగళవారం, డిసెంబర్ 03, 2013

సింగారాలా పైరుల్లోనా

మణిరత్నం ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “దళపతి” కి రాజా ఇచ్చిన ఆర్కెస్ట్రేషన్ అమేజింగ్, ఈ సినిమా నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది ఇక ప్రత్యెకించి ఈ పాటకి ముందు చివరిలోనూ వచ్చే డ్రమ్స్ కానీ పాటంతా ఒక థీమ్ లా బాక్ గ్రౌండ్ లో వచ్చే బీట్స్ కానీ రియల్లీ గ్రేట్. ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో ఏసుదాస్ గారు బాలు గారు కలిసి ఈ పాటకి ప్రాణం పోశారు. 

రాజశ్రీ గారి సాహిత్యంలో చాలా మణిరత్నం పాటల్లోలాగే కాస్త డబ్బింగ్ వాసనలు కనిపించినా కూడా హీరోలిద్దరి మధ్య స్నేహం గురించి రాసిన రెండవ చరణం చాలా బాగుంటుంది. ఇక సినిమాలో కూడా ఈ పాట సింపుల్ చిత్రీకరణతో ఆకట్టుకుంటుంది మధ్యలో నిర్మలమ్మ గారు డాన్స్ చేసి రజనీని పడేయడం నవ్విస్తుంది. ఈ సినిమాతో పెనవేసుకుని ఉన్న ఓ జ్ఞాపకాన్ని నా మెయిన్ బ్లాగ్ లో చెప్పుకుందాం ఇక్కడ పాట విని/చూసి ఆస్వాదించండి... యూ ట్యూబ్ యాక్సెస్ చేయలేని వాళ్ళు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.




చిత్రం : దళపతి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, ఏసుదాస్, కోరస్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా... రేయ్..
బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే...హోయ్..
మూల బడి వున్న బుట్టా తట్టా తీసి 
భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
తెల్లవారగానే సంకురాత్రి కాదా 
పొంగే పాలు అందరి పాలు హాయిగా...
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు 
అంతకంటే సందడేది లేదే... హోయ్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ..
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే..
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా...
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే..
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే...
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ..
తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా...
శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంటా మేమే...

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా..హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

సోమవారం, సెప్టెంబర్ 23, 2013

రుక్మిణీ కళ్యాణం హరికథ

హరికథా ప్రక్రియపై నాకున్న మక్కువ మీ అందరికీ తెలిసినదేగా ముఖ్యంగా సినిమాల్లో వచ్చే హరికథలంటే నాకు మరీ ఇష్టం. సూత్రధారులు సినిమాలోని ఈ రుక్మిణీ కళ్యాణ హరికథ కూడా బాగుంటుంది. సాథారణంగా కథకులుగా మగవాళ్ళనే చూస్తుంటాం అయితే ఈ సినిమాలో రొటీన్ కి భిన్నంగా కె.విశ్వనాధ్ గారు కె.ఆర్.విజయ గారితో హరికథ చెప్పించారు. ఆవిడ ఆహార్యానికి తగినట్లుగా సుశీల గారు నేపధ్యగానం చేశారు, కనులు మూసుకుని కథ వింటూంటే సన్నివేశాలు (సినిమాలోవి కాదు రుక్మిణీ కళ్యాణంలోని సన్నివేశాలు) కళ్ళముందు సాక్షాత్కరించేస్తాయి. 

ఈ పాటను రాసినది మాడుగుల నాగఫణి శర్మ గారన్న విషయం ఈరోజే దీని గురించి వెతుకుతుంటే తెలిసింది. ఇవికూడా ఏవైనా పద్యాలలోవేమో తెలియదు కానీ ప్రాసతో కూడిన కొన్ని కొన్ని పదప్రయోగాలు చాలా ఆకట్టుకుంటాయి. కె.వి.మహదేవన్ గారి బాణి గురించి నే చెప్పగలిగినదేముంది అద్భుతమనే మాట తప్ప. ఈ హరికథను మీరు ఇక్కడ వినవచ్చు ప్లే లిస్ట్ లో మొదటినుండి ఐదవ పాట “శ్రీరస్తూ శుభమస్తూ” అనే టైటిల్ తో ఉంటుంది.  

చిత్రం : సూత్రధారులు
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మాడుగుల నాగ ఫణి శర్మ
గానం : సుశీల, ఎస్. పి. పల్లవి

శ్రీమద్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీ హరికథా పితామహమహమ్ వందే..
నారాయణ దాస సద్గురుమ్.

శ్రీరస్తూ... శుభమస్తూ...

శ్రీరస్తు శుభమస్తు
సత్కథాలహరికీ.. హరికీ ..
ఆగమలతల కొసల విరిసినా విరికి... హరికీ
కోటి కొంగుల ముడుల పుణ్యంబు సిరికీ... హరికీ
సిరికీ... హరికీ.. శ్రీరస్తు శుభమస్తు

యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్... అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళ మోహనాకారుడైన శ్రీకృష్ణుడి అనేకానేక లీలా వినోదములలో... రుక్మిణీ కల్యాణ సత్కథా మధురాతి మధురమైనది.. అందలి నాయికామణి...
ఆ రమణీ..
లలిత పల్లవపాణి నీలసుందరవేణి...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...

కనులవి తెరచిన చాలు.. యదునందను అందమె గ్రోలూ
కరములు కదలిన చాలు.. కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు.. హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే.. వలపు ఓపని వెల్లువయ్యే..

అంతలో..

యదుకేసరితో హరితో గిరితో
మన వియ్యము గియ్యము కూడదని
శిశుపాలుని పాలొనరింతునని
తన సోదరుడాడిన మాటవినీ..
దిగులుగొనీ.. దిక్కెవ్వరనీ.. 

తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
ప్రళయమే రానున్నదని ఎంచెను..
ప్రణయ సందేశమాస్వామీ కంపెనూ..

ఆ లలిత పల్లవపాణి.. నీల సుందర వేణి..
అందాల పూబోణి ఆ రుక్మణీమణికి..
శ్రీరస్తు శుభమస్తు..
శ్రీరస్తు శుభమస్తు.

అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా
శిశుపాలునికిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా
ఆ చిన్నారి రుక్మిణీ.. 

రానన్నాడో... తానై రానున్నాడో...
ప్రభువు ఏమన్నాడో.. ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున

అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ...

తిలకము దిద్దిరదే... కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముగట్టిరదే... బంగారు చేలముగట్టిరదే
బాసికముంచిరదే... నుదుటను బాసికముంచిరదే
పదములనలదిరదే... పారాణి పదములనలదిరదే...
పారాణి పదములనలదిరదే...

ఇవ్విదమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ...
శిలపై అశువులుబాయు బలిపశువు చందంబున...
అందంబును ఆనందంబును వీడి...
డెందంబున కుందుచుండగా...

అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
శ్రీరుక్మిణీ హృదయప్రణయాక్షరీ
అదిగో వచ్చెను వాడె...

వచ్చీ వైరుల ద్రుంచి.. వరరత్న మై నిల్చి
వనితా మనోరధము దీర్చీ.. రథము బూన్చి
జయవెట్ట జనకోటి.. వెడలే రుక్మిణి తోటి
అదిగో అదిగో వాడే హరి శ్రీహరి..

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా...
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః...
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు...
 

శుక్రవారం, సెప్టెంబర్ 13, 2013

ఇంతకూ నువ్వెవరూ !!

సినీ ప్రపంచంలో ఒకోసారి కొత్తవాళ్ళు భలే మెరిపిస్తారు, దదాపు అందరూ కొత్తవాళ్ళే పని చేసిన “స్నేహితుడా” సినిమా లోని ఈ పాట అలాంటి వాటిలో ఒకటి. ఈ సినిమా పూర్తిగా చూసే అవకాశం నాకు ఇప్పటివరకూ దొరకలేదు కానీ ఈ పాటమాత్రం కొన్ని వందల సార్లు విన్నాను. సంగీత దర్శకులు, పాటల రచయిత సినిమా దర్శకుడు అంతా కొత్తవాళ్ళే అయినా శ్రేయఘోషల్ ఈ పాటకి ప్రాణం పోసింది. మీరూ ఓ సారి వినండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. వీడియో ఈ క్రింద చూడగలరు.


చిత్రం : స్నేహితుడా
సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : శ్రేయా ఘోషల్

Who who who who are you
Who who who who are you

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఆఆఆఆఆ.అ.అ.అ.ఆఆఆఆఅ

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

సోమవారం, సెప్టెంబర్ 02, 2013

నేనేనా ఆ నేనేనా...

కళ్యాణికోడూరి(కళ్యాణిమాలిక్) కంపొజిషన్ నాకు చాలా నచ్చుతుంది. నా మిత్రులలో కొందరు తనవన్నీ మెలోడీస్ ఆల్మోస్ట్ అన్ని పాటలు ఒకేలాగా ఉంటాయ్ అని కంప్లైంట్ చేసినవాళ్లు కూడా లేకపోలేదు. కానీ నాకు మాత్రం తన పాటలు వేటికవే స్లైట్ వేరియేషన్ తో ఎక్కువకాలం గుర్తుండిపోయేలా ఉంటాయ్ అని అనిపిస్తుంటుంది. "అంతకుముందు ఆ తరువాత" సినిమా కోసం తను కంపోజ్ చేసిన ఈ "నేనేనా ఆ నేనేనా" అనే పాట కూడా అలాగే నాకు చాలా నచ్చేసింది. ఈపాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలాబాగుంది. సిరివెన్నెల గారి సింపుల్ సాహిత్యం సినిమాలోని సన్నివేశాన్ని పాత్రల మనోభావాల్ని సున్నితంగా మన కళ్ళముందు పెడుతుంది. ఈమెలోడికి శ్రీకృష్ణ సునీతల స్వరం చక్కగా అమరింది. పూర్తిపాట ఆడియో లింక్ దొరకలేదు మీకెవరికన్నా తెలిస్తే కామెంట్స్ లో ఇవ్వగలరు. యూట్యూబ్ లో పూర్తిపాట ఇక్కడ వినవచ్చు. సిరివెన్నెల గారి చేతిరాతలో ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూస్తూ పాట వినవచ్చు.


 
చిత్రం : అంతకుముందు ఆతరువాత
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కళ్యాణి కోడూరి(కళ్యాణిమాలిక్)
గానం : శ్రీకృష్ణ, సునీత

నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!
ఉన్నానా నేనున్నానా!
ఉన్నానుగా అంటున్నానా!!
వెళ్ళొస్తానంటూ ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం.
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది
నేలకేనాడు దిగిరాదనీ.
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అనీ
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేనీ వింతకాదనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

ఆఅ.ఆఆఆఆఆఆఆఆ...

నన్ను నాలాగ చూపించవే అంటూ
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తనలాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

గురువారం, ఆగస్టు 22, 2013

ఏనాడు విడిపోని ముడివేసెనే..

కొన్ని పాటలు చూడడానికన్నా ముందే బాగా వినడానికి అలవాటుపడిపోతాము దాంతో ఆ పాట గురించి మన మనసులో ఒక ఊహా చిత్రం ఏర్పడిపోతుంది. ఈ పాట గురించి కూడా నాకు అలాంటి ఒక అందమైన ఊహా చిత్రమే మనసులో ముద్రించుకుపోయింది. చిన్నపుడు సినిమా మొదటిసారి చూసినపుడు ఈ పాట గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ తరువాత తరువాత ఈపాట వినేకొద్ది చాలా నచ్చేసింది అలాగే తెరమీద అప్పుడేం చూశానో గుర్తులేకుండా నా ఊహలు మాత్రమే మిగిలిపోయాయి. 

ఇంత ఉపోధ్ఘాతమెందుకు చెప్పానంటే ఈ పాట చూడడం కన్నా కనులు మూసుకుని వినడం నాకు చాలా ఇష్టం. అలా ఎన్నిసార్లు రిపీటెడ్ గా విన్నానో లెక్కలేదు. సిరివెన్నెల గారు రాసిన ఈ పాట సాహిత్యం చాలా అందంగా ఉంటుంది. ఇళయరాజా గారి బాణి గోదారి మీద చల్లని గాలుల్లో పడవ ప్రయాణంలా సుతిమెత్తగా హాయిగా సాగుతుంది. ప్రారంభమే పక్షుల కిల కిలా రావాలతో చాలా చక్కగా ప్రారంభమవుతుంది, మొదటి చరణం ముందు వచ్చే ఫ్లూట్ బిట్ కూడా భలే ఉంటుంది. 

స్వాతిముత్యం సినిమాలో నేపధ్యసంగీతంలో ఊపయోగించిన ఒక మ్యూజిక్ బిట్ వంశీ గారికి బాగా నచ్చి అదే ట్యూన్ లో కావాలని చెప్పి మరీ ఇళయరాజా గారితో ఈ పాటకి ట్యూన్ చేయించుకున్నారట. బాలు గారి గొంతు కాస్త జలుబు చేసినట్లు అనిపిస్తుంది కానీ అదే అందంగా ఉంటుంది ఇక జానకి గారు ఎప్పటిలాగే పాట మూడ్ కి తగ్గట్లు బ్రహ్మాండంగా పాడారు. 

ఈ చక్కని పాట ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు వీడియో కూడా చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పాటంటే అమితమైన ఇష్టంగల నా ఆత్మీయ మిత్రుడు.. ఇళయరాజా కి భక్తుడు, వంశీకి వీరాభిమాని కూడా... ఈ వారాంతంలో తన పెళ్ళి సంధర్బంగా ఈ టపా తనకి అంకితం.  


చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని


ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుధల ఆమనిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

సా...గామ గమ గామ గమరీ..
సారి నిరి సారి నిసనీ..
సాదాదరీ.. రీగాగపా..


మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన

రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలమూ కలగానమై
నిలవాలి మన కోసము... ఈ మమత


ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మధుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం

పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే
చేరింది మన జంటకు... ముచ్చటగ


ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

బుధవారం, ఆగస్టు 21, 2013

వెన్నెలై పాడనా...

వంశీ,ఇళయరాజా ల కాంబినేషన్లో చాలా మంచి పాటలున్నాయన్న విషయం మనకి తెలిసిందే వాటిల్లో ఓ ఆణిముత్యం లాంటి పాట ఇపుడు మీకు పరిచయం చేయబోతున్నాను. “శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమా పేరు వింటేనే నేను ఒక చిత్రమైన అనుభూతికి లోనవుతాను. తొంభైల తర్వాత అశ్లీలత పాళ్లు హెచ్చడంతో క్రమంగా కనుమరుగైన ఈ రికార్డింగ్ డాన్సులు ఒక కళారూపం అని కూడా చెప్పుకోవచ్చేమో. యూట్యూబ్ లు టీవీలూ వీడియోలు లేని ఆకాలంలో సినిమా హీరో హీరోయిన్స్ గెటప్పూ, మానరిజమ్స్ తో సహా స్టెప్స్ ని స్టేజి మీద ప్రదర్శించి, ఆకాశంలో అందని తారల్లా తెరమీద మాత్రమే వెలిగే సినిమా తారలని కళ్ళముందు నిలబెట్టే ఈ డాన్సుట్రూపులు తొంభైల వరకూ కూడా తెలుగు వారి ప్రతి ముఖ్యమైన వేడుకలోనూ పాలుపంచుకుంటూ ఒక వెలుగు వెలిగాయ్. వీటి నేపధ్యంలో వంశీ అల్లుకున్న ఓ పిరికి వాడి ప్రేమకథే ఈ సినిమా.

ఈ సినిమాలో నాకు ఎక్కువగా ఇష్టమైన పాట “వెన్నెలై పాడనా”, సాధారణంగా డెబ్బై ఎనభైలలో వచ్చిన పాటలు చిత్రీకరణ చూడడానికి నేను కొంచెం భయపడతాను. ఎంతో అందమైన పాటలను చాలా చిత్ర విచిత్రంగా భరించలేని నటీనటులపై చిత్రీకరించి భయపెడతారు. ఐతే ఈ పాట మాత్రం నాకు పాటతో పాటు చిత్రీకరణ సైతం మనసులో ముద్రించుకు పోయింది. కుమ్మరి చక్రం, మగ్గం, రాట్నం లాంటి వాటి చుట్టూ పల్లె వాతావరణాన్ని ప్రతిభింబిస్తూ ఇలా కూడా చిత్రించ వచ్చా అనిపించేలా తీయడం ఒక్క వంశీ గారికే చెల్లింది.

ఇక ఈ పాట రచయిత గురించి వెతుకుతుంటే నాకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ ట్యూన్ సిద్దమయ్యాక పాటల రచయితకి ఫాల్స్ లిరిక్స్ ఇవ్వడం కోసం స్వతహాగా భావుకుడు రచయిత అయిన వంశీగారు మధ్యమధ్యలో ఇళయరాజా గారు కొన్ని పదాలు అందిస్తుండగా రాశారట. పాట బాగుందని దానినే ఫైనల్ వర్షన్ గా ఉంచేశారని అందుకే టైటిల్స్ లో వంశీ ఇళయరాజాల పేర్లు పాటల రచయితల కార్డ్ లో ఉంటాయని వంశీగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా పాతబంగారం ఫోరంలో చదివాను. ఐతే లలనామణి, తలలోమణి, నవలామణి లాంటివి వంశీగారివేలే అనిపించినా రెండో చరణంలో ప్రమిద కాంతిపువ్వు ప్రమద చిలుకునవ్వు, ఉలిశిలఖేలనము లాంటివి నిజంగా వంశీగారు రాసినవేనా అనిపిస్తాయి.

ఇక ఆ చక్కని సాహిత్యానికి బాలు జానకి గార్లు తమ స్వరంతో జీవం పోశారు. నిజానికి వాళ్ళిద్దరూ కొన్ని పాటలను శ్రద్దగా కష్టపడి పాడినట్లు తెలియనివ్వరు ఆ పాటలు వాళ్ళు పాడలేదు పాటతో స్వరాలతో ఆడుకున్నారు అనిపిస్తుంటుంది ఇదీ అలాంటి పాటే జాగ్రత్తగా గమనించి చూడండి. ఈ పాటలో మధ్యలో అక్కడక్కడ బాలుగారు నవ్వే నవ్వు మగవాళ్ళకి మాకే "ఆహా ఏం నవ్వాడ్రా బాబు" అనిపిస్తుంది ఇక అప్పట్లో ఆ నవ్వు విన్న అమ్మాయిల పరిస్థితి గురించి ఏం చెప్పమంటారు :-)  

ఈ పాట వీడియో కింద ఎంబెడ్ చేస్తున్నాను ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. సంధర్బానుసారంగా ఎక్కువగా పాత పాటలను లైట్ గా రీమిక్స్ చేసి ఈ సినిమాకు ఉపయోగించుకున్నా ఈ సినిమా కోసమే సిద్దం చేస్కున్న ఈ పాటతో పాటు “ఏనాడు విడిపోని” అన్న మరో పాట కూడా చాలా బాగుంటుంది. ఆ పాట గురించి రేపటి టపాలో. ఈ రెండు టపాలు ఈ వారాంతం పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడవబోతున్న ఓ ఆత్మీయ మిత్రుడికి అంకితం.

 

చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వంశీ,ఇళయరాజ
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా

పూవులో.. మ్ నవ్వులో.. మ్ మువ్వలా.. మ్ హూ..
ఒంపులో.. సొంపులో.. కెంపులా.. ఆహా..
కలకల పొదలో కిలకిల కధనం
ముసిముసి రొదలో అలసట మధురం

పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా
ఇవ్వనా.. యవ్వనం.. పువ్వునై.. అహహ
గువ్వనై.. హో గవ్వనై.. హో నవ్వనా.. అహ్హహ్హ
లలనామణినై తలలోమణినై
నవలామణినై చింతామణినై

వెన్నెలై పాడనా 
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా

నీ.. నిసరీ..
సా.. సరిగా..
పనిసా.. సమగ సరిగ..
పనిపా.. గపమ గమరీ..
మనినిని పససస నిరిరిరీ
గగగమ నిసరిమగ
 పససస నిరిరిరీ గా..
మదసని
గసమగ పనిసని సా..

లీలగా తూగుతూ ఏమిటో దేహమె
వేడుకా ధారలే దాహమై కోరిన
పాడుతూ వేడినా కోరుతూ పాడినా
భేషజం చూపుతూ దోహదం చేయవు
మోవికెంపు బాధ గుండె మువ్వ గాధ
పొద్దు పువ్వులాగ నవ్వుతుంది చూడు
వెలుతురు.. మ్ నేత్రమే.. మ్ సోకని ప్రాంగణము
గాలికే.. ఊపిరి.. పూసే పరిమళము

తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తరిగడతత్తోం.. తరిగడతత్తోం.. తకతోం..
తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తరిగడతత్తోం.. తరిగడతత్తోం.. తకతోం..

చందనం పూయనా పూలలో రాజుకి
నోచిన నోముకే పూచినా రోజుకి
సుందరం ధూపమే వేయనా పూజకి 
జాలిగా గాలిలో వీచినా మోజుకి
ప్రమిద కాంతి పువ్వు
ప్రమద చిలుకు నవ్వు
కలికి కలలు రాసే కధల పురము వాసి
బ్రతుకున.. మ్ పలికిన.. మ్ కిలకల కూజితము హహహ
మధురమై.. మొలవనీ.. ఉలిశిల ఖేలనము 

పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా

బుధవారం, జులై 24, 2013

అత్తారింటికి దారేది – Lyrics All songs.

అటాచ్ చేసిన వీడియోలో ఆడియో సాంగ్స్ ఒక వరుసలో ఉన్నాయ్ అదే వరుసలో పాటల సాహిత్యం(లిరిక్స్) ఈ క్రింద ఇస్తున్నాను. యూట్యూబ్ యాక్సెస్ లేని వారు ఈ పాటల ఆడియో మాత్రం వినాలనుకుంటే రాగాలో ఇక్కడ వినవచ్చు.

ఈ సినిమా పాటలపై నా అభిప్రాయాన్ని నా మెయిన్ బ్లాగ్ లో ఇక్కడ చదవచ్చు. 



~*~*~*~*~*~*~*~ ఆరడుగుల బుల్లెట్టు ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : విజయప్రకాష్, సాకీ బై MLR కార్తికేయన్.

గగనపు వీథి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీవె లాంటి ఒంటి నైజం.. వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో 
శత్రువంటు లేని వింత యుద్ధం
ఇది గుండె లోతు గాయమైన సిద్ధం
నడిచొచ్చే నర్తనశౌరీ  పరిగెత్తే పరాక్రమ సైరీ.. 
హాలాహలం ధరించిన దగ్ధాహృదయుడో

వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపు వీథి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటీ
వినిపించని కిరణం చప్పుడు వీడు...
వడివడిగా వడగళ్ళై దడదడమని జారేటీ
కనిపించని జడివానేగా వీడు 
శంఖం లో దాగేటీ పొటేత్తిన సంద్రపు హోరితడు
శోకాన్నే దాచేసే ఆశోకుడు వీడురో ..

వీడు ఆరడుగుల బుల్లెట్టు 
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ
చిగురించిన చోటుని చూపిస్తాడూ
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీ        
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో 
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు 
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపు వీథి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

~*~*~*~*~*~*~*~ నిన్ను చూడగానె  ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : దేవీశ్రీప్రసాద్
గానం : దేవీశ్రీప్రసాద్.
కోరస్ : అనిత, ప్రియదర్శని, ప్రియహెమేష్.

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే....
హో అదేమిటే....
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే...
హొయ్ అదేమిటే...హొయ్
ఓయ్.. ఆ.. ఆ..
హే అవతలకి పో.. పోయా..

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే..
హొయ్ అదేమిటే.... హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే...
హొయ్ అదేమిటే... హె

ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

నిన్ను చూడగానే... నా చిట్టి గుండే...
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే....
హొయ్ అదేమిటే.... హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే...
హొయ్ అదేమిటే... హె

వన్స్ మోర్ విత్ ఫీలింగ్...
ఓహ్.. నో...

ఏ అంత పెద్ద ఆకాశం.. అంతులేని ఆ నీలం..
నీ చేప కళ్లలోతుల్లో.. ఎట్ట నింపావె ఇరగదీసావే
ఏయ్ భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే..
ఏయ్ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంట పడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె కాపలాకి నేను వెంట రానా
కృష్ణా రాధలా... నొప్పీ బాధలా... ఉందాం రావె మరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే....
హొయ్ అదేమిటే.... హెయ్

ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం
మ్.. అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా...
కోడల్లేని అత్త గుణవంతురాలు ఆ హుం ఆ హుం
హోయ్ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా...
పచ్చి పాల మీద మీగడేదమ్మా
హా వేడి పాలలోన వెన్న ఏదమ్మా  ఆ హుం ఆ హుం

ప్లీజ్ డ్యాన్స్ యార్

మోనలీస చిత్రాన్ని...  గీసినోడు ఎవడైనా
ఈ పాలసీస అందాన్నీ చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్నీ ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగిఉందనీ తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగల్ను
తెలుగు భాషలో నాకు తెల్సిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా.. వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా

నిన్ను చూడగానె... నా చిట్టి గుండె...
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే....
హొయ్ అదేమిటే.... హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే...
హొయ్ అదేమిటే... హే...

~*~*~*~*~*~*~*~ దేవ దేవం భజే ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
గానం : పాలక్కాడ్ శ్రీరాం, రీటా
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవీశ్రీప్రసాద్

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం

ఆ ఆ ఆ....
వేల సుమ గంధముల గాలి అలలా...
కలల చిరునవ్వులతొ కదిలినాడు..
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడూ
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలె ఆతడి సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ ఋణ బంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం...
దేవ దేవం భజే దివ్య ప్రభావం

ఈ క్రింది చరణం సినిమా చివరిలో ఎండ్ క్రెడిట్స్ వచ్చేప్పుడు ప్లే అవుతుంది ఆడియో లో లేదు

ఆఆఆఅ...
కనుల తుది అంచునొక నీటి మెరుపూ..
కలలు కలగన్న నిజమైన గెలుపూ..
పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..
సెగల ఏడబాటుకది మేలి మలుపూ..
భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులా
వెలుగులు కురిసిందీ ఈ ఆనందం..
ఋతువులు గడిదాటే చెరగని చైత్రములా
నవ్వులు పూసిందీ ఈ ఆనందం..
జీవమదె మాధురిగ మమతలు
చిలికెను మనసను మధువనం.


దేవ దేవం భజే దివ్య ప్రభావం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం


~*~*~*~*~*~*~*~ బాపు గారి బొమ్మో ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
గానం : శంకర్ మహదేవన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవీశ్రీప్రసాద్

హేయ్ బొంగరాలంటీ కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ...

అమ్మో బాపు గారి బొమ్మో..
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ...

అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్  రమ్మో... హై

పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా ఎదపైనే నర్తించిందీ...
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది...

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... హో హో

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా...
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నే బంధీ చేసిందీ
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ....

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...

సయ్యో అయ్యయ్యో మహియే అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మహియే అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ

ఏ మాయాలోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది..
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యనీ ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ..

~*~*~*~*~*~*~*~ కిర్రాకు కిర్రాకు ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
గానం : నరేంద్ర
రాప్ రాసింది పాడింది : డేవిడ్ సైమన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవీశ్రీప్రసాద్

Oh my god I can't believe that you said that
Or am i dreaming it.. I just hear that
My heart is racing like a Cheeta
So I wanna sing this కొత్త పాట

ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి
ఏం దెబ్బ తీసినావే..
రాకాసి రాకుమారి కోపంగ పళ్లు నూరి
ఐ లవ్ యు చెప్పినావే..
అందంగ పెట్టినావె స్పాటు..
గుండె తాకింది ప్రేమ గన్ను షాటు..
ఏది లెఫ్ట్ ఏది నాకు రైటు..
మందు కొట్టకుండనే నేను టైటు..
క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లెపూలు జల్లినట్టు
షర్ట్ జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు
పిచ్చి పిచ్చిగుందే...

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే... ఓఒ.య్..

Oh my god I can't believe that you said that
Or am i dreaming it.. I just hear that
My heart is racing like a Cheeta
So I waanna sing this కొత్త పాట

పెదవి స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ..
సొగసు తీగలో.. కదిలింది పూల నర్సరీ
కళ్ళలో కలల గ్యలరీ
చిలిపి చూపులో కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదొ చల్లినావె అత్తగారి పిల్లా..
సిత్తరాల నవ్వుపైన రత్తనాలు జల్లా..
కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటె ఇల్లా..
పిచ్చి పిచ్చిగుందే..

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే

మాంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్టు
మైండంత గోలగుందే
బెంగాలి స్వీటు లోన భంగ్ ఏదో కలిపి తిన్న
ఫీలింగ్ కుమ్ముతుందే
కౌబయ్ డ్రెస్సు వెసినట్టు
క్రిష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్న చోటే ఉంటూ
ఆ మూను మీద కాలు పెట్టినట్టూ
సిమ్ము లేని సెల్లు లోకి ఇన్ కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫెస్ పౌడరద్దినట్టు
పిచ్చి పిచ్చిగుందే..

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే...ఓఒయ్..

~*~*~*~*~*~*~*~ ఇట్స్ టైం టు పార్టీ ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
గానం : మాల్గాడి శుభ, డేవిడ్ సైమన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవీశ్రీప్రసాద్

ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటరైనా వదలకుండా దిల్లో నిండినాడే..
కళ్ళలోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో.. ఆ పట్టుకో..
హేయ్.. Its time to party now..
Its time to party now..
నోటికొచ్చిన పాటేదో పాడేయ్ పాడేయ్ పాడేయ్
ఒంటికొచ్చిన డాన్సేదో చేసేయ్ చేసేయ్ రో..
Its time to party.. Its time to party
చేతికందిన డ్రింకేదో తాగేయ్ తాగేయ్ తాగేయ్..
లోకమంతా ఉయ్యాలే ఊగేయ్ ఊగేయ్ రో..
its time to party.. its time to party
కమాన్ కమాన్ lets chill n thrill n kill it now..
కమాన్ కమాన్ పిచ్చెక్కించేద్దాంరో..
కమాన్ కమాన్ lets rock it shake it break it now
కమాన్ కమాన్ జల్సా చేద్దాంరో..

its time to party now.. 
its time to party now.. రావే ఓ పిల్లా..
its time to party now.. చేద్దాం గోలా..
its time to party now.. రావే ఓ పిల్లా..
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా..

ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటరైనా వదలకుండా దిల్లో నిండినాడే..
కళ్ళలోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో.. ఆ పట్టుకో..

ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను..
అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానవుతాను..
its time to party.. its time to party
హేయ్ మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను
నువ్ కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను..
its time to party.. its time to party
హేయ్ బోయ్.. అబ్బాయ్.. లవ్ గాడ్ కు నువ్వూ క్లోనింగా..
అమ్మోయ్! అమ్మాయ్.. తొలిచూపుకె ఇంతటి ఫాలోయింగా..

its time to party now
its time to party now.. రావే ఓ పిల్లా..
its time to party now.. చేద్దాం గోలా..

మైనేమ్ ఈజ్ మార్గరీటా.. మాక్ టైల్ లా పుట్టానంటా..
చూపుల్తో అందమంతా సరదాగా సెర్చ్ చేయమంటా..
its time to party.. its time to party
వాచ్ మేన్ ఏ లేనిచోటా వయసే ఓ పూలతోటా..
వెల్కం అని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా..
its time to party.. its time to party
హెల్లో హెల్లో అని పిలవాలా నిను పేరెట్టీ..
పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారంకట్టీ..

its time to party now
its time to party now.. రావే ఓ పిల్లా..
its time to party now.. చేద్దాం గోలా..
its time to party.. its time to party
its time to party. 

~*~*~*~*~*~*~*~ కాటమ రాయుడా ~*~*~*~*~*~*~*~

చిత్రం : అత్తారింటికి దారేది
గానం : పవన్ కళ్యాణ్
సాహిత్యం :
సంగీతం :

హేయ్.. కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..అ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..ఆ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 

బేట్రాయి సామిదేవుడా

సేపకడుపు చేరిబుట్టితీ.. 

రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హెహె హోయ్..
 

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 
బేట్రాయి సామిదేవుడా
 

ఓటిమన్ను నీల్లలోన ఎలసి ఏగమే తిరిగి.. 
ఓటిమన్ను నీల్లలోన.. హ్ హొహొయ్
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
 

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 
బేట్రాయి సామిదేవుడా
సేపకడుపు చేరిబుట్టితీ.. 

రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హొయ్ హొయ్..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 

బేట్రాయి సామిదేవుడా ఆఆహోయ్యా...

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.