శుక్రవారం, జూన్ 09, 2017

రాగమో అనురాగమో...

నాలుగు స్తంభాలాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

హే..హే..హే..హే..హే..హే..
లలలల..హే..హే..
రాగమో అనురాగమో
గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా
పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ!

రాగమో అనురాగమో
గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా
పూదండలో సన్నాయిలా

సూరీడు చల్లారు నీ చూపూ
చలిగాలిలా వీచే నా వైపూ
పరుగెత్తే పరువంలోనా
పడగెత్తే ప్రణయంలాగ
సాగిపోవాలి జతగా

నీ కంటిలో ఉన్న చలిమంటా
తొలిగంట కొట్టింది నా కంట
పయనించే జవనంలోనా
పలికే ఋతుపవనం లాగా
జల్లు రావాలి వడిగా

ఈ వడిలో.. ఉరవడిలో
ముడివడి పోవాలీ
కాలమెంత దూరమో
కలిసి చూడగా

రాగమో అనురాగమో
గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా
పూదండలో సన్నాయిలా

సందెల్లో మందార బొట్టుందీ
అందాల ముద్దిచ్చి అంటింది
సెలయేటి అలజడిలోనా
చెలరేగే అల్లరిలాగా
ఊగిపోవాలి కలిసీ

సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ
వద్దుల్లో వరసైన వలపుందీ
నాజూకు నడకల్లోనా
నలిగేటి మొలకల్లాగా
ఆవిరవ్వాలి అలిసీ

ఆవిరులో నా విరులే
విర విరలాడాలీ
కౌగిలింత ఇల్లుగా కలిసి చేరగా !

రాగమో అనురాగమో
గీతమో సంగీతమో
హ హ నా గుండెలో ఓ కోయిలా
ల ల ల ల..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ

లాలలా..లలాలలా
హేహెహే..లాలలలా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.