గురువారం, జూన్ 08, 2017

పంట చేలో పాల కంకి...

పదహారేళ్ళ వయసు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

పంట చేలో పాల కంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోన సీమా ఎండల్లా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే

పంట చేలో పాల కంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ

శివగంగ తిరణాలలో.. నెలవంక తానాలు చేయాలా
చిలకమ్మ పిడికిళ్ళతో.. గొరవంక గుడిగంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా... నే కొండ పిండి కొట్టాలా
మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా
మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాల కంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ

గోదారి పరవళ్ళలో.. మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్ళతో.. మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా
నీ మాట బాట కావాలా.. నా పాట ఊరు దాటాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే

పంట చేలో పాల కంకి నవ్విందీ... అహహ అహహ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ... అహహ అహహ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా... అహహ అహహ
లేత పచ్చ కోన సీమా ఎండల్లా... అహహహ అహహహ

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.