బుధవారం, జూన్ 14, 2017

పదే పదే పాడుతున్నా...

సీతామాలక్ష్మి చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
నేపధ్య గానం  : సుశీల

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే 

ఇది అనగనగ కథ కాదు.. అందమైన జీవితం
కన్నె వయసు చిలకమ్మ.. వెన్న మనసు గోరింక..
కలసి కట్టుకొన్న కలల గూడు.. ఒకనాడు.

చిలకమ్మా ఎగిరిపొయే గోరింకను విడిచీ...
గోరింకా కన్నీరింకా... వగచే ఇది తలచి
చిలకమ్మా ఎగిరిపొయే గోరింకను విడిచీ...
ఆ.ఆ. గోరింకా కన్నీరింకా... వగచే ఇది తలచి

ఆమనులే వేసవిలైతే ఎవరిని అడగాలి
దీవెనలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి
మనసన్నది చేయని పాపం.. మనసివ్వడమే ఒక నేరం
మనిషైనా మాకైనా.. అనుభవమొకటే..ఏ..ఏ...

పదే పదే పాడుతున్నా పాడిన పాటే....
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే

రామా లీల ప్రేమజ్వాలా రగిలిన బ్రతుకేలే
రాలు పూత బంగరు సీత మిగిలిన వలపేలే...
రామా లీల ప్రేమజ్వాలా రగిలిన బ్రతుకేలే
ఆ..ఆ...రాలు పూత బంగరు సీత మిగిలిన వలపేలే

మనసు పడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడూ...
చూపులకే ఊపిరి పోసి చీకటి కొలిచాడూ...
ఎడారిలో కోయిల ఉన్నా ఆ దారిని రాదు వసంతం...
మనిషైనా మాకైనా.. అనుభవమొకటే...

పదే పదే పాడుతున్నా పాడిన పాటే...
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే...


2 comments:

యెందుకు వేణూజీ..జస్ట్ జోకింగ్..నైస్ సాంగ్..

హహహ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.