పూజ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : దాశరథి
గానం : బాలు
ఆహా...హా...ఏహే..హే...లాలా ...లా...లాలా..లా..
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం
అంతట నీరూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
నీవే లేని వేళ... ఈ పూచే పూవులేల
వీచే గాలి.. వేసే ఈల.. ఇంకా ఏలనే
కోయిల పాటలతో ..పిలిచే నా చెలీ..
ఆకుల గలగలలో నడిచే కోమలీ..
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
నాలో ఉన్న కలలు.. మరి నీలో ఉన్న కలలూ
అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే..
తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా
నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ..
ఆహా..హా...ఓహో..ఓ..లాలాలా...ఏహే..హే...
2 comments:
ఈ మూవీలో అన్ని పాటలూ చాలా బావుంటాయి..ఇక మల్లెతీగ పాటైతే..యెప్పుడువిన్నా బాలు గారి గొంతు మనసుని తడిచేస్తుంది..
మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.