డూడూ బసవన్న చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : డుడుబసవన్న (1978)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
ముత్యాల కోనలోన
రతనాల రామసిలకా
ముత్యాల కోనలోన
రతనాల రామసిలకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా
ముత్యాల కోనలోన
రతనాల రామసిలకా
ముత్యాల కోనలోన
రతనాల రామసిలకా
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా
సెమ్మచెక్కలాడమంటే ఓరబ్బో
అమ్మబాబో అన్నావు ఇన్నాళ్ళు
పెళ్లి ఊసంటే ఓరబ్బో
కళ్ళు తేలేసినావు ఇన్నాళ్ళు
సెమ్మచెక్కలాడమంటే ఓరబ్బో
అమ్మబాబో అన్నావు ఇన్నాళ్ళు
పెళ్లి ఊసంటే ఓరబ్బో
కళ్ళు తేలేసినావు ఇన్నాళ్ళు
నిన్నటి బసవడు కాడే...ఏ...ఏ
నిన్నటి బసవడు కాడే
ఇక ముందుందే నా తడాకా
ముత్యాల కోనలోన
రతనాల రామసిలకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా
కొండగాలి కొడతాంది మల్లమ్మో
ఉండలేకున్నాను ఓలమ్మో
అహ కొండగాలి..అబ్బా
కొండగాలి...అయ్యో
కొండగాలి కొడతాంది మల్లమ్మో
ఉండలేకున్నాను ఓలమ్మో
ఎక్కువేమి అడగలేదు మల్లమ్మో
ఒక్క ముద్దు పెట్టి చూడు మల్లమ్మో
అహ..ఒక్క ముద్దు
అయ్యో...ఒక్క ముద్దు...అబ్బ
ఒక్క ముద్దు పెట్టి చూడు ఓలమ్మో
ముంగిట సన్నాయి మ్రోగందే....ఏ
ముంగిట సన్నాయి మ్రోగందే
అహ..ముద్దిమ్మంటే మజాకా
ముత్యాల కోనలోన
రతనాల రామసిలకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా
ఎందాకా....ఊరేగునందాకా
ఎందాకా....ఊరేగునందాకా
ఎందాకా....ఊరేగునందాకా
2 comments:
ఈ పాట యెప్పుడు విన్నా రోజంతా వెంటాడుతూనే ఉంటుంది..చాలా టిపికల్ ట్యూన్..
అవునండీ.. ఇంట్రెస్టింగ్ ట్యూన్.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతిగారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.