బుధవారం, జూన్ 28, 2017

కలిసే మనసుల తొలి గీతం...

చేసిన బాసలు చిత్రంలోని ఒకచక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : చేసిన బాసలు (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఓహో..ఓ..ఓహోహో..ఓ ఏహే..ఓహోహో.ఏహేహే

కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం

ఆమని వలపుల కమ్మని కథ... ఏమని తెలుపను ఎదలో సొద
రాగాలేవో నాలో రేగే...  వయ్యరాలే ఉయ్యాలూగే

కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం

అనురాగం ఆలాపనగా...  ప్రతి జన్మకు అది దీవెనగా
నే చేసిన బాసల లయలో...  శ్రుతి చేసిన వీణల జతగా
ఈ సంగమే మన సరిగమగా...  పలికే జీవనరాగంలో
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం

ఆమని వలపుల కమ్మని కథ... ఏమని తెలుపను ఎదలొ సొద
రాగాలేవో నాలో రేగే...  వయ్యరాలే ఉయ్యాలూగే
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం

ఓహో..ఓ..ఓహోహో.. ఆఅహాఆహ్హహహ
ఈ తీరని ఆవేదనలే... ఒక తీయని ఆరాధనగా
నీ కౌగిలి నా కోవెలగా...  నా బ్రతుకే నీ హారతిగా
శృంగారంలో సింధురాలే చిలికే సంధ్యా రాగంలో

కలిసే మనసుల తొలి గీతం.... ఎన్నో జన్మల సంగీతం
కలిసే మనసుల తొలి గీతం... ఎన్నో జన్మల సంగీతం 

2 comments:

ఒకప్పుడు రోజూ విన్న పాట ఇది..థాంక్స్ ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.