గోరింటాకు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసుమాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో
ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొంటెవయసు కోరికలాగా
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో
పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో
పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి
పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.