గురువారం, జూన్ 29, 2017

మూగైన హృదయమా...

ఆత్మ బందువు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలే లాలించే
ఎడదను ఇమ్మనీ అడుగుమా
మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా

కాచావు భారము అయినావు మౌనము
రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే
అణగడు సూర్యుడు ఆరడు

మనసన్నది మాసిపోనిది
సొత్తు ఉన్నది సుఖమే లేనిది

ఈ వేదనా ఎన్నినాళ్లదీ 
ఓదార్చినా ఒడ్డు లేనిది

నా పాటకే గొంతు పలికింది లేదు
నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు

తడిలేని నేలైనావు 
తొలకరులు కురిసే తీరు
ఎవ్వరూ అన్నది... 
నిన్నెరిగిన మనిషి అన్నది

మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలే లాలించే
ఎడదను ఇమ్మనీ అడుగుమా

మనసేడ్చినా పెదవి నవ్వెను
పైపైది ఈ పగటి వేషము
నీ గుండెలో కోవెలున్నది
ఏ దేవతో వేచియున్నది
ఇన్నాళ్లు మూసిన ఈ పాడు గుడిని
ఏ దేవతిక వచ్చి తెరిచేదనీ
ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనాను
ఎవ్వరీ కోయిల... చిగురాశల చిట్టి కోయిల
 
అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల
విన్నానే కనులెదుట కన్నానే
పొంగులై హృదయము పొర లెనే
నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల
విన్నాను కనులెదుట కన్నాను
మారునా... నీ వెత తీరునా 

 

2 comments:

హార్ట్ టచింగ్ మూవీ యెండ్ సాంగ్స్..

అవును శాంతి గారు.. వండర్ ఫుల్ మూవీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.