శనివారం, జూన్ 17, 2017

కట్టు కథలు సెప్పి...

పదహారేళ్ళ వయసు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి 

ఆ ఆ ఆఅ ....ఆ..ఆఅ...ఆఆఆఅ
కట్టు కథలు సెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే 
బంగారు బాల పిచ్చుకా 
మా మల్లి నవ్వాల పక పక 
మల్లీ మల్లీ నవ్వాల పక పక 

కట్టు కథలు సెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే 
బంగారు బాల పిచ్చుకా 
మా మల్లి నవ్వాల పక పక 
మల్లీ మల్లీ నవ్వాల పక పక 

అనగనగ ఓ అల్లరి పిల్లోడు
ఓ నాడా పిల్లాడ్ని సీమగుట్టిందీ
సీమగుట్టి సిన్నోడు ఏడుస్తుంటే
సీమా సీమా ఎందుకు నువు కుట్టావంటే
పుట్టలో ఏలెడితే కుట్టనా
నా పుట్టలో ఏలెడితే కుట్టనా నేను కుట్టనా
అంటా కుట్టనా అన్నదీ
అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు
అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు
కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో
కట్టు కతలు సెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే 
బంగారు బాల పిచ్చుకా 
మా మల్లి నవ్వాల పక పక 
మల్లీ మల్లీ నవ్వాల పక పక 

పల్నాటి పడుచుపిల్ల కోటిపల్లి రేవు దాటి
బంగారి మావ కోసం గోంగూర చేనుకొస్తే
ఆఆఆఆ...ఆఆఆఆఅ...ఆఆఆ...
ఎన్నెలంటి నా ఓడు చందురూడా
ఎండ దెబ్బ తీసాడు చందురూడా
బుగ్గ మీద నా ఓడు చందురూడా
ముద్దరేసి పోయాడు చందురూడా
పోయినోడు పోకుండా రాత్రే నా కల్లోకొచ్చాడు
సిన్న నాటి ముచ్చటే సిలక పచ్చన
ఒకనాటి మాటైన నూరేళ్ళ ముచ్చట
నూరేళ్ళ ముచ్చటా... హ హ హ


నీలాటి రేవులో నీడల రాగం 
సాకిరేవులో ఉతుకుడు తాళంనీలాటి రేవులో నీడల రాగం 
సాకిరేవులో ఉతుకుడు తాళం
తదరినతా...
తదరినతా...ఆఅ...ఆఅ.ఆఅ...
హహ హహ హహ
 తదరిన ... తదరిన ...తదరిన
తదరిన ... తదరిన ...తదరిన
హహ హహ హహ హహ హహ

 

2 comments:

ఈ పాటకి పిక్ భలే ఉందండీ..ద లిటిల్ మెర్మైడ్ ..

అవునండీ నాకు కూడా బాగా నచ్చింది.. మెర్మెయిడ్ చుట్టూ తన నేస్తాలు కూడా ఈ పాటలోలానే నవ్విస్తున్నాయ్ తనని :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.