శుక్రవారం, జూన్ 02, 2017

బంగారు బొమ్మ రావేమే...

రక్తసంబంధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : రక్తసంబంధం (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : అనిసెట్టి
గానం : సుశీల

బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
 కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే
 
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..

ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.