అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, వాణిజయరాం
జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగుల తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ... ఓ... ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా
జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగుల తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ... ఓ... ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా
కొండల కోనల కోయిల పాడెను సంగీతం
కొండల కోనల కోయిల పాడెను సంగీతం
మధువులు ఆనుచు.. మత్తుగ పాడుచు..
తుమ్మెద ఆడేను సల్లాపం...
జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ..ఓ..ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా
పచ్చని పసరిక పానుపు పరిచెను పోదరి౦ట్లో
పచ్చని పసరిక పానుపుపరిచెను పోదరి౦ట్లో
వెచ్చనివలపుల ముచ్చట తీరగ
తనువులు కరిగెను కౌగిట్లో
ఓ.. ఓ.. జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ..ఓ..ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా
గలగల పారుచు కిలకిల నవ్వేను సెలయేరూ
తొలి తొలి కలయిక జంటను చూసీ
దీవించినదీ ప్రతి అణువూ..
జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ..ఓ..ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా
3 comments:
ఈ మూవీలో అన్నీ పాటలూ అద్భుతంగా ఉంటాయండి..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
Good Post...
Click Here To అందమైన భామల ఫోటోలు మత్రమే కాకుండా Telugu Dubbed movies, Tollywood news, Tollywood Movies and Tollywood Gallery వంటి అన్నింటి సమాచారం మీకిక్కడ లభిస్తుంది. వీలయితే ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.