శనివారం, జూన్ 03, 2017

మధుమాసవేళలో...

అందమే ఆనందం చిత్రంకోసం బాలు గారు పాడిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అందమే ఆనందం (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

మధుమాసవేళలో మరుమల్లె తోటలో...
మధుమాసవేళలో మరుమల్లె తోటలో...
మనసైన చిన్నదీ.... లేదేలనో

మధుమాసవేళలో మరుమల్లె తోటలో...

ఆడింది పూల కొమ్మా... పాడింది కోయిలమ్మా...
అనురాగ మందిరంలో..ఒ..ఒ..కనరాదు పైడిబొమ్మ..ఆ..ఆ...
ప్రణయాలు పొంగే వేళ..ఆ..ఆ.ఆ...ప్రణయాలు పొంగే వేళ...
నాలో రగిలే ఏదో జ్వాలా...

మధుమాసవేళలో మరుమల్లె తోటలో...

ఉదయించే భానుబింబం... వికసించలేదు కమలం..
నెలరాజు రాక కోసం... వేచింది కన్నె కుముదం...
వలచింది వేదనకేనా..ఆ..ఆ..వలచింది వేదనకేనా...
జీవితమంతా దూరాలేనా...

మధుమాసవేళలో మరుమల్లె తోటలో...
మనసైన చిన్నదీ.... లేదేలనో...
మధుమాసవేళలో మరుమల్లె తోటలో....
ఉహ్..ఆ..మరుమల్లె తోటలో...
అహ..హ..ఆ..మరుమల్లె తోటలో... 
 
 

1 comments:

this is not written by Sri Veturi, pl check film titles

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.