వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వయ్యారిభామలు వగలమారి భర్తలు (1982)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
అది చూపై విరి తూపై
కురిసింది పూల వాన ఓ..
కురిసింది పూల వాన
రాగాల పల్లకి లోనా
పిలిచింది వలపే ఔనా
అది పాటై విరి బాటై
వెలసింది జీవితానా
ఓఓ వెలసింది జీవితానా
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
గగనాల తార భువనాల జారి
నన్ను చేరువేళలో
నీవే ఆ తారై మదిని వెలిగినావులే
ఇలవంక జారు నెలవంక తీరు గోటమీటు వేళలో
నీవే నా నీడై మనసు తెలిపినావులే
మరులు గొలిపినావులే
అనని వినని ఏ రాగం
మనలో పలికే సరాగం
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
అది చూపై విరి తూపై
కురిసింది పూల వాన ఓ..
కురిసింది పూల వాన
రాగాల పల్లకి లోనా
పిలిచింది వలపే ఔనా
నీ తీపి ఉసురు నా వైపు విసిరి వెల్లువైన వేళలో
నాలో అల నీవై కలలు రేపినావులే
నీ నీలి కనుల లేలేత కలలు వెల్లడైన వేళలో
నాలో ఎద నీవై నిదుర లేచినావులే
కదలి పాడినావులే
మనసే కలిసే ఏ తీరం
విరిసే మమతా కుటీరం
రాగాల పల్లకి లోనా
పిలిచింది వలపే ఔనా
అది పాటై విరి బాటై
వెలసింది జీవితానా
ఓఓ వెలసింది జీవితానా
మేఘాల పందిరి లోనా
మెరిసింది మెరుపే ఔనా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.