మంగళవారం, జూన్ 06, 2017

నింగీ నేలా ఒకటాయెలే...

పూజ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : దాశరథి
గానం : బాలు, వాణీ జయరాం

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
లలలలలల
నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
లలలలల 
నింగీ నేలా ఒకటాయెలే...

హో హోహోహో...

ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే
నా వెంట నీవుంటే ఎంతో హాయిలే
ఆహాహా లాలాలా... ఆహాహా లాలాలా
హృదయాలు జత జేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే
నీవే నేను లే ...నేనే నీవు లే
లలలలలా... లాలాల లాలాల...
లాలాల లాలాల... లలల 

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
లలలలల 
నింగీ నేలా ఒకటాయెలే...
 
 ఆహాహాహా
రేయైనా పగలైనా నీపై ధ్యానము
పలికింది నాలోన వీణా గానము
ఆహాహా లాలాలా... ఓహోహో లాలాలా
అధరాల కదిలింది నీదే నామము
కనులందు మెదిలింది నీదే రూపము
నీదే రూపమూ ... నీవే రూపము
లలలలలా... లాలాల లాలాల...
లాలాల లాలాల... లలల 
 
నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.