శుక్రవారం, జూన్ 30, 2017

చిలక పచ్చ తోటలో...

జానకిరాముడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జానకి రాముడు.
సంగీతం : కే.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల
చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుకూ కుకూ కూకూ
కుకూ కుకూ కూకూ

చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుకూ కుకూ కూకూ
కుకూ కుకూ కూకూ
 
వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట
వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట
అరుదైన వరదయ్య బిరుదైన క్షేత్రయ్య
గోపాలా.. మువ్వ గోపాలా
అని మురిసేటి తెలుగింటిపాట
అని మురిసేటి తెలుగింటిపాట

కుకూ కుకూ కూకూ
కుకూ కుకూ కూకూ
చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుకూ కుకూ కూకూ
కుకూ కుకూ కూకూ
 
తెలుగులో తేనెల తేట
వెతలలో వెన్నెల బాట
తెలుగులో తేనెల తేట
వెతలలో వెన్నెల బాట
రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై
శ్రీ రామా.. రా రా.. రఘురామా
అని పిలిచేటి తెలుగింటి పాట
అని పిలిచేటి తెలుగింటి పాట

కుకూ కుకూ కూకూ
కుకూ కుకూ కూకూ
చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుకూ కుకూ కూకూ
కుకూ కుకూ కూకూ

 

2 comments:

ఆ హీరో హీరోఇన్ కన్నా..మీ హీరో హీరోయిన్నే బావున్నారండీ..

హహహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ :-) పాపం నాగ్ అప్పట్లో కాస్త టఫ్ఫేలెండి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.