తోటరాముడు చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఏంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తోటరాముడు (1975)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : సుశీల
నేనంటే నేనే నా మాటంటే మాటే
నన్నెదిరించే వారెవ్వరూ.. హే
దారంట నే వెళితె అదురూ
ఈ ఊరంత నేనంటే బెదురూ
నేనంటే నేనే నా మాటంటే మాటే
నన్నెదిరించే వారెవ్వరూ.. హే
దారంట నే వెళితె అదురూ
ఈ ఊరంత నేనంటే బెదురూ
చంద్రునిలోని జింకను రప్పిస్తాను
ఇసుకను పిండీ తైలం గుప్పిస్తాను
చంద్రునిలోని జింకను రప్పిస్తాను
ఇసుకను పిండీ తైలం గుప్పిస్తాను
ఆడిందే ఆటా నే పాడిందే పాట
ఆడిందే ఆటా నే పాడిందే పాట
కాదంటే ఆ నోళ్ళకు తాళం వేయిస్తాను.
నేనంటే నేనే నా మాటంటే మాటే
నన్నెదిరించే వారెవ్వరూ.. హే
దారంట నే వెళితె అదురూ
ఈ ఊరంత నేనంటే బెదురూ
వెండి బిందెలో నీళ్ళు తోడుకొస్తాను
పసిడి గిన్నెలో పాలారగిస్తాను
వెండి బిందెలో నీళ్ళు తోడుకొస్తాను
పసిడి గిన్నెలో పాలారగిస్తాను
పంతం వస్తేనూ నే పందెం వేస్తేను
పంతం వస్తేనూ నే పందెం వేస్తేను
లక్షలైన విసిరేసి లక్ష్యం సాధిస్తాను
నేనంటే నేనే నా మాటంటే మాటే
నన్నెదిరించే వారెవ్వరూ.. హే
దారంట నే వెళితె అదురూ
ఈ ఊరంత నేనంటే బెదురూ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.