కన్నెవయసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కన్నెవయసు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరధి
గానం : జానకి
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
తీయని సన్నాయి కోయిల వాయించే
తీయని సన్నాయి కోయిల వాయించే
తొలకరి మేఘాలు బాజాలు మోగించె
మల్లె పందిరేసింది మంచు చిందులేసింది
నెమలి పురివిప్పి నాట్యాలాడే
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
హోయ్ కెరటాల చినుకులు జలకాలాడించె
ఆ కెరటాల చినుకులు జలకాలాడించె
పగడాల చివురాకు పైటను సవరించె
గాలి ఈల వేసింది.. తీగ కొంగులాగింది
కొంటె తుమ్మెదలు మాటేశాయి..
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
2 comments:
యెక్కువ యేదివిలో విరిసిన పాట అందరికీ తెలిసినా..ఈ పాట కూడా బానే ఉండండీ..
అవునండీ ఈ పాట కూడా బాగుంటుంది. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్....
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.