పెద్దరికం చిత్రంకోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : ఏసుదాస్, స్వర్ణలత
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
ఒడిలో పెరిగిన చిన్నారినే
ఎరగా చేసినదా ద్వేషమూ
కధ మారదా.. ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువుని కుమ్మితే
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువుని కుమ్మితే
అభమూ శుభమూ ఎరుగని
వలపులు ఓడిపోయేనా !
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం !
విరిసీ విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా .. ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల
పువ్వులు కాలిపోయేనా !
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం !
2 comments:
ee song lyricist Vaddepalli Krishna Garru anukunta..okka sari check chesukondi..
ఓహ్ చెక్ చేస్తానండీ.. మ్యూజిక్ కంపెనీ వాళ్ళ యూ ట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇచ్చిన వివరాలను బట్టి భువనచంద్ర గారి పేరు పెట్టాను. వెరిఫై చేయడానికి వేరే సోర్స్ చూస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.