ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సంకీర్తన చిత్రం కోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఏసుదాస్
ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ....
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో..ఓ..ఓ.. కథగానో.. ఓ.. ఓ..
మిగిలేది నీవే.. ఈ జన్మలో.. ఓ..
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
నాలోని నీవే నేనైనానో
నీలోని నేనే నీవైనావో
నాలోని నీవే నేనైనానో
నీలోని నేనే నీవైనావో
విన్నావా ఈ వింతను.. అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను.. అన్నారా ఎవరైనను
నీకూ నాకే చెల్లిందను.. ఉ.. ఉ..
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలి రంగై నేనున్నాను
కలిసేది ఊహేనను.. ఊహల్లో కలిసామను..
కలిసేది ఊహేనను.. ఊహల్లో కలిసామను..
నీవూ.. నేనే.. సాక్షాలను..
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
కలగానో..ఓ.. కథగానో.. ఓ..
మిగిలేది నీవే ఈ జన్మలో..
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
2 comments:
నాకు చాలా ఇష్టమైన పాట...ఈ పాట వీడియో చూడడం ఇదే మొదటిసారి. సినిమా చూడలేదు కానీ పాట విన్నాను.
థాంక్స్ నీహారిక గారు... అవునండీ మంచి పాట.. సినిమా కూడా యూట్యూబ్ లో ఉన్నట్లుంది ఆసక్తి ఉంటే చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.