అల్లుడుగారు చిత్రంలోని ఓ చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటలో అన్నమాచార్య కీర్తనకు సాటిరాగల మరో చక్కని చరణం జోడించన సినీ కవి ఎవరో తెలియదు. టైటిల్ కార్డ్ లో జాలాది, జొన్నవిత్తుల, రసరాజు, గురుచరణ్ గార్ల పేర్లున్నాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అల్లుడుగారు (1990)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : అన్నమయ్య + ??
(జొన్నవిత్తుల/జాలాది/రసరాజు/గురుచరణ్)
(జొన్నవిత్తుల/జాలాది/రసరాజు/గురుచరణ్)
గానం : ఏసుదాసు, చిత్ర
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కుమ్మరదాసుడైన కురువరత్తినంబి
ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడూ..
కొండలలో నెలకొన్న.. గమ దని సగమా
గగని దమ గస కొండలలో...
సగ సమ గద మని గమ
సగ సమ గద మని గమ
గద మని దస నిదమగ దమగస
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
ఎదలోని శ్రీసతి ఎపుడో ఎడబాటు కాగ
ఎనలేని వేదనలో రగిలినవాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతీ
మమతలకోవెలలో మసలనివాడు
నీతికి నిలిచినవాడు దోషిగ మారెను నేడు
ప్రేమకి ప్రాణంవాడు శిక్షకు పాత్రుడు కాడు
ఆర్తరక్షక శ్రీవెంకటేశ్వర కరుణతో
తోడునీడై వాణ్ణి కాపాడు నేడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
2 comments:
ఇదీ వేటూరిది కాదు అనుకుంటున్నా!
థాంక్స్ ఫణీంద్ర గారూ టైటిల్ కార్డ్స్ లో వారి పేరే లేదండీ.. బహుశా జొన్నవిత్తుల గారు రాశారేమో..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.