గురువారం, జనవరి 28, 2016

సుక్కల్లే తోచావే...

నిరీక్షణ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నిరీక్షణ (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఏసుదాస్

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో..
కాగిందే నా పేదగుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై..ఈ..
ఉన్నానే ఈ నాటికి నేస్తాన్నై..ఐ..
ఉన్నా ఉన్నాదొక దూరం
ఎన్నాళ్లకు చేరం.. తీరందీనేరం..

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

తానాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే..ఏ..
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే..ఏ
ఉందా కనీళ్ళకు అర్థం
ఇన్నేళ్ళుగా వ్యర్థం.. చట్టందే రాజ్యం..

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.