సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సీతారామ కళ్యాణం (1961)
సంగీతం : గాలిపెంచలయ్య
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : పి.బి.శ్రీనివాస్
దేవ దేవ పరంధామ
నీల మేఘ శ్యామా
దేవ దేవ పరంధామ
నీల మేఘ శ్యామా
దేవ దేవ పరంధామ
నీల మేఘ శ్యామా
అఖిల జగతి సృష్టిజేసి
ఆడిపాడి అంతలోనే
అఖిల జగతి సృష్టిజేసి
ఆడిపాడి అంతలోనే
ఆపెదవు బొమ్మలాట
నటన సూత్రధారీ..
దేవ దేవ పరంధామ
నీల మేఘ శ్యామా
నిన్ను విడచి తనను మరచి
హుంకరించు అహంకారీ
నిన్ను విడచి తనను మరచి
హుంకరించు అహంకారీ
కానలేడు నీ మహిమా..ఆఆ..
కానలేడు నీ మహిమా
నటన సూత్రధారీ...
దేవ దేవ పరంధామ
నీల మేఘ శ్యామా
పరమ పురుష నీదు కరుణ
పరుగుదీయు కుంటివాడు
పరమ పురుష నీదు కరుణ
పరుగుదీయు కుంటివాడు
మాతయౌను గొడ్రాలే...ఆఆఅ...
మాతయౌను గొడ్రాలే
నటన సూత్రధారీ..
దేవ దేవ పరంధామ
నీల మేఘ శ్యామా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.