గురువారం, జనవరి 21, 2016

స్వరరాగ గంగా ప్రవాహమే...

సరిగమలు చిత్రం నుండి ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బోంబే రవి
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్

ప్రవాహమే గంగా ప్రవాహమే ....

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ

కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు 
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే    

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

 

2 comments:

ఎంత చక్కటి పాటలో కదా యేసుదాస్ గారివి, చక్కటి పాటలను ఏరి గుదిగుచ్చి మాకిస్తున్నారు వేణు గారు ధన్యవాదాలు - లక్ష్మి

థాంక్స్ లక్ష్మి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.