సోమవారం, జనవరి 25, 2016

కదిలే కాలమా...

పెదరాయుడు చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెదరాయుడు (1995)
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీ హర్ష
గానం : ఏసుదాస్, చిత్

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమ దేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ

లాలించే తల్లి.. పాలించే తండ్రి..
నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ.. నీకంటి చెమ్మ..
నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే.. ఏ ఏ..
నీ కడుపులో పసివాడినే
ఏ నాడు తోడుని నీడను వీడనులే...

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
పేగే కదలగా
సీమంత మాయెలే ప్రేమ దేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ

తాతయ్య తేజం.. పెదనాన్న నైజం..
కలిసున్న పసి రూపం
నీ రాణి తనము.. నా రాచ గుణము..
ఒకటైన చిరు దీపం
పెరిగేనులే నా అంశమూ.. ఊ ఊ...
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములతో

ఎన్నో నోములే.. గత మందు నోచి ఉంట
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా
నడిచే దైవమా..
నీ పాద ధూళూలే పసుపు కుంకమలు నాకు

ఎన్నో నోములే గత మందు నోచి ఉంటా
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.