కృష్ణ ప్రేమ చిత్రంలోని ఓ మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : కృష్ణ ప్రేమ (1943)
సంగీతం : గాలి పెంచలయ్య
సాహిత్యం :
గానం : శాంత కుమారి
కృష్ణా కృష్ణా నీ ప్రేమ మహిమా
తెలియని వారై ఏమో అందురు
వారికి జ్ఞానోదయము అందించ
రారా కృష్ణా..
ఊదుము కృష్ణా మోహన మురళిని
ఊదుము కృష్ణా పావన మురళిని
ఊదుము కృష్ణా మోహన మురళిని
ఊదుము కృష్ణా పావన మురళిని
మోహ జలధిలో ఈదగ రారా
మోహ జలధిలో ఈదగ రారా
ఊదుము కృష్ణా పావన మురళిని
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
నీ దయను మోహమును తెలిసికొని
నీ దయను మోహమును తెలిసికొని
మేల్కొనగా కరుణాపయోనిధి
మేల్కొనగా కరుణాపయోనిధి
ఊదుము కృష్ణా మోహన మురళిని
ఊదుము కృష్ణా
కృష్ణా కృష్ణా కృష్ణా
నీ చరణములు సేవించుటయే
నా చరితార్థము
నీ చరణములు సేవించుటయే
నా చరితార్థము
నీ నామార్చన గానామృతమే
గానామృతమే గానామృతమే
నీ నామార్చన గానామృతమే
జీవన భాగ్యమహ జీవన భాగ్యమహ
నీ ప్రేమయే జగదాధారము
నీ ప్రేమయే జగదాధారము
నిఖిలము నీవే నీవే దేవా
నిఖిలము నీవే నీవే దేవా
ఊదుము కృష్ణా పావన మురళిని
మోహన మురళిని
ఊదుము కృష్ణా కృష్ణా.. కృష్ణా.. కృష్ణా..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.