గురువారం, జనవరి 14, 2016

యదుమౌళీ / ఏడుమల్లెలెత్తు...

ధనుర్మాసం చివరి రోజైన ఈ రోజు దీపావళి చిత్రం నుండి ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్ర్రం : దీపావళి (1960)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్యులు
గానం : పి.సుశీల, ఘంటసాల, ఎ.పి.కోమల 

యదుమౌళి ప్రియసతి నేనే 
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 

లేదు భూమిని నా సాటి భామా 
లేదు భూమిని నా సాటి భామా 
అందచందాలు నీవేను లేమా
అందచందాలు నీవేను లేమా
నీ హృదయేశ్వరి నేనేగా 

యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 

హే ప్రభూ 
నీ సేవయె చాలును నాకూ 
హే ప్రభూ
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ 
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ 
మురిసెడి వరము నొసగుము స్వామీ 
అదియే నాకు పరమానందమూ 
హే ప్రభూ

సోగ కన్నుల నవ్వారబోసీ 
సోగ కన్నుల నవ్వారబోసీ 
పలుకు పంతాల బందీని జేసీ 
కోరిక తీరగ ఏలేగా 
 
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 



~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మిత్రులందరకూ భోగి పండుగ శుభాకాంక్షలు. సింధూరం చిత్రం కోసం కృష్ణవంశీ ఈ పెద్ద పండగ సందడంతా చాలా చక్కగా చిత్రీకరించిన ఓ హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సింధూరం (1998)
సంగీతం : శ్రీ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కృష్ణరాజ్, ప్రదీప్, మాధవపెద్ది

ఏడు మల్లెలెత్తు సుకుమారికి
ఎంత కష్టం వచ్చింది నాయనో
భోగి పళ్ళు పొయ్యాలి బేబికి
ఏమి దిష్టికొట్టింది నాయనో
ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చెమట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో
అగ్గి చుక్కలైనాయిరో

ఏ..ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చెమట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో
అగ్గి చుక్కలైనాయిరో

పాతమంచమిదిగో పట్టుకొచ్చినానురో
భగ్గుమంటు మండుతాదిరో
పేకతల్లిరో పీకులాడమందిరో
సందు చూసి సద్దుకోరో హోయ్
బోడిజుట్టు ఉందని కోడిపుంజు
కావురో కాలుదువ్విరాకయ్యో
ఎక్కిరించనా ఎంతచక్కగుంటవే
నా పడచు పావురాయో
అలా మాయమాటలాడితే ఐసైపోనయ్యా
బలాదూరు మానకుంటే
భరతం పడతడు మా మామయ్య

హరిలో రంగా హరీ చూడరో దీనల్లరి
గాదెలో నిండే వరి వీధిలో చిందే సిరి
సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి
నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో

ఎంత గోల పెట్టినా నెత్తి మీదకొచ్చెరో 
కుంకుడు స్నానాలు
చింత మొద్దులా అంతనిద్దరేందిరా 
ఏమాయె పౌరుషాలు
ఎముకలు కొరికే ఈ చలిపులిని 
చెమటలు కక్కించరో
అహ మంచుగడ్డిలా ఉన్నరేయిని 
మంటపాలు చెయ్యిలేరో
ప్రతి ఇంట బూరెల వంట 
మహబాగుంది సరే
కనుం దాకా కక్కా ముక్కా 
దొరకదు అది ఒక లోటే కదరో

సంకురాత్రి పండగొచ్చెరో 
సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటకొచ్చెరో 
గంగడోలు దువ్వి పంపరో

తెలుగింట లోగిళ్ళలోనికి 
పెద్దపండగొచ్చింది చూడరో
కిల కిల సందళ్ళతో ఇలా 
కొత్తపొద్దు తెచ్చింది చూడరో

సంకురాత్రి పండగొచ్చెరో 
సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటకొచ్చెరో 
గంగడోలు దువ్వి పంపరో
హే..సంకురాత్రి పండగొచ్చెరో 
సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటకొచ్చెరో 
గంగడోలు దువ్వి పంపరో


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.