బుధవారం, జనవరి 27, 2016

తెలవారదేమో స్వామీ...

శృతిలయలు చిత్రంలోని ఈ పాట అన్నమాచార్య కీర్తనేనేమో అనిపించేలా వ్రాయడం సిరివెన్నెల గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఏసుదాస్, సుశీల

తెలవారదేమో స్వామీ..
తలపుల మునుకలో..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..

తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..
తెలవారదేమో స్వామీ..

తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..
తెలవారదేమో స్వామీ..

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలఅలజడికి నిద్దుర కరవై..
కలలఅలజడికి నిద్దుర కరవై

అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..

అలసిన దేవేరి అలమేలు మంగకూ ఊఊ...
తెలవారదేమో స్వామీ
గామపని... తెలవారదేమో...
సా ని ద ప మ ప మ గ ని స గా మ
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ..

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.