శ్రీకృష్ణావతారం చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967)
సంగీతం : టివి.రాజు
రచన : సి.నారాయణరెడ్డి
గానం : సుశీల, ఘంటసాల
మెరుగు చామన ఛాయ మేని సొంపుల వాడు
నును మీగడల దేలు మనసున్న చెలికాడు
దొరవోలె నా మనసు దోచుకున్నాడే..
జగములనేలే గోపాలుడే
జగములనేలే గోపాలుడే
నా సిగలో పూవవును ఈనాడే
మగువుల నేలే గోపాలుడే
నీ మనసే దోచెను ఈనాడే
మగువుల నేలే గోపాలుడే
మగువుల నేలే గోపాలుడే
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
కోరినంతనే దొరకవులే
మదనుని గెలిచిన మగరాయని గని
మదనుని గెలిచిన మగరాయని గని
మల్లెలు తామే వలచునులే
మగువా నీ మది తెలిసెనులే
జగములనేలే గోపాలుడే
నీ మనసే దోచెను ఈనాడే
భామా మానస పంజరమ్ములో
భామా మానస పంజరమ్ములో
రామ చిలుకవై నిలిచేవా
పంజరమైనా ప్రణయ దాసునికి
పంజరమైనా ప్రణయ దాసునికి
పసిడి మేడయే ప్రియురాలా
బాసయె చేసెద ఈ వేళా..
జగములనేలే గోపాలుడే
నీ మనసే దోచెను ఈనాడే
చేసిన బాసలు చిగురులు వేయగ
చేసిన బాసలు చిగురులు వేయగ
గీసిన గీటును దాటవుగా
అందముతో నను బందీ జేసిన
అందముతో నను బందీ జేసిన
సుందరి ఆనతి దాటేనా
ఉందునే ఓ చెలి నీలోనా
జగములనేలే గోపాలుడే
నా సిగలో పూవవును ఈనాడే
మగువుల నేలే గోపాలుడే
నీ మనసే దోచెను ఈనాడే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.