శుక్రవారం, జనవరి 15, 2016

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా...

మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా కోటి స్వరపరచిన ఓ సంక్రాంతి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సోగ్గాడి పెళ్ళాం (1996)
సంగీతం : కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర, బృందం

కలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది
తుమ్మెద ఓ తుమ్మెద
మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది
తుమ్మెద ఓ తుమ్మెద
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
చలిమంట వెలుగుల్లూ తుమ్మెద ఓ తుమ్మెద

 
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా  
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా.. ఆ... ఆ... పేరంటం 
ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో
పొంగే హేమంత సిరులు..

గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో

 
మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ
నమ్మే మన పల్లెటూళ్లు
న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ
చెబుతాయి స్వాగతాలు
బీద గొప్పోళ్లనే మాటలేదు 
నీతి నిజాయితీ మాసిపోదు
మచ్చలేని మనసు మాది
మంచి పెంచు మమత మాది
ప్రతి ఇల్లో బొమ్మరిల్లు...

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా 
సరదాలు తెచ్చిందే తుమ్మెదా

పాటే పంచామృతం మనసే బృందావనం
తడితేనే ఒళ్లు ఝల్లు
మాటే మకరందము చూపే సిరి గంధము
చిరునవ్వే స్వాతి జల్లు
జంట తాళాలతో మేజువాణి
జోడు మద్దెళ్లనీ మోగిపోనీ
చెంతకొస్తే పండగాయే
చెప్పలేని బంధమాయే
వయసే అల్లాడిపోయే..

 
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా  
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా.. ఆ... ఆ... పేరంటం  
ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో
పొంగే హేమంత సిరులు..
 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.