శుక్రవారం, జనవరి 22, 2016

సృష్టికర్త ఒక బ్రహ్మ...

అమ్మ రాజీనామా చిత్రంలో ఏసుదాస్ గారు గానం చేసిన ఓ అమ్మపాటను ఈ రోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది ఆడియో జ్యూక్ బాక్స్, ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పాట వీడియో ఇక్కడ చూడచ్చు లేదా ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమ్మ రాజీనామా (1991)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి నారాయణ రావు
గానం : ఏసుదాస్

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆ అమ్మకే.. తెలియని.. చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

బొట్టు పెట్టి పూజ చేసి.. గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే.. గోవు తల్లే కోత కోత
బొట్టు పెట్టి పూజ చేసి  గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత

విత్తు నాటి చెట్టు పెంచితే
చెట్టు పెరిగి పళ్ళు పంచితే
తిన్న తీపి మరిచిపోయి
చెట్టు కొట్టి కట్టెలమ్మితే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆకు చాటు పిందె ముద్దు.. తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే.. కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు

ఉగ్గు పోసి ఊసు నేర్పితే
చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే
చేయి మార్చి చిందులేస్తే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.