శుక్రవారం, నవంబర్ 10, 2017

ఎక్కు తొలిమెట్టు...

నరసింహ చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నరసింహ (1999)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేష్
గానం : శ్రీరామ్, కోరస్

జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం...
పోరాటంలో ఉంది జయం
 
ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు
గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు
గమ్యం చేరేట్ట

నువు పలుగే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా

నువు పలుగే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా
పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహ

పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది
అడుగిడు నరసింహ
పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది
అడుగిడు నరసింహ

జీవితమంటే పోరాటం...
పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం...
పోరాటంలో ఉంది జయం

మరు ప్రాణి ప్రాణం తీసి
బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి
నవ్వేది అసురుడురా
కీడే చేయని వాడే మనిషి
మేలునే కోరు వాడే మహర్షి
కీడే చేయని వాడే మనిషి
మేలునే కోరు వాడే మహర్షి
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా

ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు
గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు
గమ్యం చేరేట్ట

నువు పలుగే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా
పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహ
పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది
అడుగిడు నరసింహ
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా

 
ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు

 

గురువారం, నవంబర్ 09, 2017

అడుగేస్తే అందే దూరంలో...

గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని ఒక ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గోల్కొండ హైస్కూల్ (2011)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హేమచంద్ర

అడుగేస్తే అందే దూరంలో.. హలో
అదిగో ఆ తారతీరంలో.. చలో
అటు చూడు ఎంత తళుకో
అది వచ్చి వాలెననుకో
కనులింట ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదమరుపో
మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో

అడుగేస్తే అందే దూరంలో.. హలో..హో..

కొండంత భారం కూడా తేలిగ్గ అనిపిస్తుంది
గుండెల్లో సందేహలేం లేకుంటే
గండాలో సుడిగుండాలో ఉండే ఉంటాయి అనుకుంటే
సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టుంటుందే
ధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని
సరదాగా దూసుకెళిపో.. కడదాక ఆగననుకో
కలగన్న రేపునిపుడే కలుసుకో

ఉత్సాహాం పరుగులు తీస్తూ విశ్రాంతే వద్దనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడ ఏదో ఆటల్లే కనపడుతుంటే
గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయంతే
నీ గమ్యం ఎదైనా..వెళ్ళాలే గాని, రమ్మంటే రాదు కదా
ప్రతి బాట కొత్త మలుపే, ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే, తెలుసుకో!

ఇది నేటి ఆదమరుపో
మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో


బుధవారం, నవంబర్ 08, 2017

One Way One Way జీవితానికి...

గమ్యం చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : గమ్యం (2008)
సంగీతం : ఈ. యస్. మూర్తి
సాహిత్యం : ఈ. యస్. మూర్తి
గానం : నోయల్, రంజిత్

Getup baby getup getup getup get up
baby getup getup getup getup getup
Go go go go Gamyam Go go go go Gamyam
U never know how to love the game
U never know how to worship the game
Until you know to love yourself
Love your soul you'll love yourself common

One way One way జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదేమరి
సాగిపొయే ప్రయాణం

runway లాంటిది కాదుగా ఇది
ఎన్నో ఎన్నో మలుపులున్నది
ఎగుడు దిగుడు చూసుకోదిది
పరుగు తీసే ప్రవాహం

నీ దారిలోన నవ్వు
చిలకరించే మల్లెపువ్వులెన్నో
తీయతీయగానే నిన్ను
గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృష్టి లో రహస్యం

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
It's a wonderful world you got to feel the joy
అంతుతేలని సృష్టి లో రహస్యం
Don't be a fool don't be money's toy

One way One way జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదేమరి
సాగిపొయే ప్రయాణం
Freak it..

జగమే ఒక మాయ బ్రతుకే ఒక మాయ
అని అన్నది ఎవరో అది విన్నది ఎవరో
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా
ఒక్క చూపుకై బ్రతికే ఆ మాయలో హాయి లేదా
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి
బదులు ఎవ్వరు చెప్పలేరుగా
అందుకే నేటి రోజే నీది

ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నది యవ్వనం
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నది యవ్వనం

తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు
తను వెళ్ళే చొటే తెలుసా మరి తనకు
నిన్న అన్నదిక రాదు
గతమంటె ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు
కలలాంటిదే కదా మనకు
ఎన్ని వేల చిరు వేషాలో
కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచేలోగా
మారిపోతుంది నాటకరంగం

ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

One way One way జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదేమరి
సాగిపొయే ప్రయాణం

నీ దారిలోన నవ్వు చిలకరించే
మల్లెపువ్వులెన్నో
తీయతీయగానే నిన్ను
గాయపరిచే తేనెటీగలెన్నో

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృష్టి లో రహస్యం
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృష్టి లో రహస్యం


మంగళవారం, నవంబర్ 07, 2017

మట్టి ఒడిలోనె...

భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలోని ఒక ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భీమిలీ కబడ్డీ జట్టు (2010)
సంగీతం : సెల్వగణేష్
సాహిత్యం : అభినయ శ్రీనివాస్
గానం : శంకర్ మహదేవన్

మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా

నిప్పై రగలాలోయ్.. నువు నింగికి ఎగరాలోయ్
గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్
ప్రతి దిక్కు తూరుపు కాగా ఉదయించర సూర్యుడి లాగా
ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిర వృక్షం లాగా
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

నిప్పై రగలాలోయ్.. నువు నింగికి ఎగరాలోయ్
గెలుపే నీదవగా ఒక యుద్ధం జరగాలోయ్
ప్రతి దిక్కు తూరుపు కాగా ఉదయించర సూర్యుడి లాగా
ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిర వృక్షం లాగా
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

నినుగన్న నేలతల్లి రుణమును తీర్చూ
నీ నుదిటీ రాతను నువ్వే అనువుగా మార్చూ
నీతో నీకే సమరం కాదా నీ తొలి విజయం
పడుతూ లేస్తూ కెరటం చేరేనయ్యో తీరం
  
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా

కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ

గుండె పాట కబడి కబడి
మట్టి ఆట కబడి కబడి
ఆకలి దప్పులు కబడి కబడి
అందరి మెప్పులు కబడి కబడి
మాటల్లోన కబడి కబడి
చేతల్లోన కబడి కబడి
కబడి కబడి కబడి కబడి
కబడి కబడి కబడి కబడి

కూతే పడుతూ గీతే దాటితె
కాలో చెయ్యో ఆయుధమైతే
ఆపైనా ఫలితం కాదా మీదే మీదే
మనసును బుద్ధిని ఏకం చేసీ
కంటీ పాపను బాణం చేస్తే
రాబోయే విజయం కూడా మీదే మీదే
కణకణ రగిలే ఆశలు ఎదలో 
ఊపిరి ఐనవి ఈవేళా
భగభగ మండే బాధల నదిలో
అమృతమున్నదిరా
ధగధగ మెరిసే ఆశయ శిఖరం
అధిరోహించే సైన్యంరా
ఆఖరి వరకూ ఆగని పరుగూ
తీయక తప్పదురా 

మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా
మట్టి ఒడిలోనె విజయాల నిధి ఉంది కదా
జట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పదా

సోమవారం, నవంబర్ 06, 2017

ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను...

కార్తీక సోమవారం సంధర్బంగా శివుణ్ణి స్మరిస్తూ బాహుబలి చిత్రంలోని శివుడు చేసిన సాహస కృత్యాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాహుబలి-ది బిగినింగ్ (2015)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : ఇనగంటి సుందర్
గానం : కీరవాణి, మౌనిమ

జఠాఘటాః సంభ్రమభ్రమ నిలింప నిర్ఝరీ
విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధరీ
ధగ ధగ ధగజ్వలల్లల్లాటపట్ట పావకే
కిషోర చంద్రశేఖరే రతిప్రతిక్షణం మమా

ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ?
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నందీ
ఎవ్వరూ కనందీ ఎక్కడా వినందీ
శివుని ఆన అయ్యిందేమో
గంగ ధరికి లింగమే కదిలొస్తానందీ

ధరాధరేంద్ర నందినీ విలాసబంధు బంధుర
స్పురద్రుగంత సంతతి ప్రమోదమాన మానసే
క్రుపాకటాక్ష ధోరణీ నిరుద్దదుర్దరాబదీ
ఖ్వచిదిగంబరే మనోవినోదమేథువస్తుణీ

జఠాభుజంగపింగళస్పురత్పనామణిప్రభా
కదంబకుంకుమద్రవ ప్రలిప్తదిగ్వధూముఖే
మగాంధసింధురస్పురథ్వగుత్తరీయమేథురే
మనోవినోదమద్భుతం విభత్తుభూతభర్ధరీ

ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నందీ
ఎవ్వరూ కనందీ ఎక్కడా వినందీ
శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానందీ 

ఆదివారం, నవంబర్ 05, 2017

కదిలే పాదమిది...

బాణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాణం (2009)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వనమాలి
గానం : శంకర్ మహదేవన్

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం
ఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశం
ప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగా
నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తియమనదా

చెరగదే జ్ఞాపకమేదైనా
పసితనం దాటిన ప్రాయాన
సమరమే స్వాగతమిచ్చేనా
కలగనే ఆశయమేదైనా
బతుకులో ఆశలు రేపేనా
ఇపుడిలా నీ దరి చేరేనా
ఎదను తాకే గాయాలు 
తాగే నేస్తాలు నీలో
ఎదురు చూసే కాలాలు 
పూసే చైత్రాలు నీ దారిలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా

వెలుగయే వేకువలెన్నైనా
వెతికితే లేవా నీలోనా
జగతికే దారిని చూపేనా
గగనమే నీ తొలి మజిలీనా
గమనమే ఓ క్షణమాగేనా
విజయమే నీడగ సాగేనా
అలలు రేపే సంద్రాలు 
దూకే సైన్యాలు నీలో
చెలిమి కోరే లోకాలు 
చేసే స్నేహాలు ఈ వేళలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా




శనివారం, నవంబర్ 04, 2017

ఆట.. ఆట.. ఇది గెలవక...

ఆట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్

అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
హే.. జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...

అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట
 
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట

అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...

హే.. ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంటా

అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా

చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివి నుంచేం దిగిరాలేదు మన తారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...

  

శుక్రవారం, నవంబర్ 03, 2017

చెయ్ జగము మరచి...

అశ్విని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అశ్విని (1992)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన


ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన


నిదురపోనేల నింగినీనేల
అలుపురానేల గెలుపునిన్నేల
ఒడలు వంచాలి ఓడి గెలవాలి
కదలి రావాలి కాలమాగాలి
కలలు పండాలి గగన మందాలి
నేడు నీకిది జీవన విధానం
బ్రతుకు నవ్విన నందనం
నీదొక ఆగని ప్రయాణం
అడుగు దాటును యోజనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన


ఉడుకు పుట్టాలి ఊపు రావాలి
చెమట పిండాలి శ్రమలు పండాలి
మట్టిలో పుట్టి మణివి కావాలి
జనము చూడాలి జాతి మెచ్చాలి
మెదడుకే నీవు పదును పెట్టాలి
నేడు నీదొక నూతన పురాణం
విజయ విప్లవ కేతనం
నీవొక జీవన ప్రమాణం
ప్రగతికే అది చేతనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన

ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం  
 

గురువారం, నవంబర్ 02, 2017

తికమక మకతిక...

శ్రీ ఆంజనేయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి
రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కలా మనిషీ
తై దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిది
 
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ….
తై దిదితై దిదితై దిదితై

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసీ

అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా
ఆ రామగాథ నువు రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ….
తై దిది తరికిటతోం- తరికిటతోం తరికిటతోం తత్తోం

తికామక తిక తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

 

బుధవారం, నవంబర్ 01, 2017

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా...

బ్లాగ్ మిత్రులు, కంప్యూటర్ ఎరా సారధులు శ్రీధర్ నల్లమోతు గారు చేపట్టిన వన్ ఇయర్ ఛాలెంజ్ కు మద్దతుగా ఈ రోజునుండీ ధనుర్మాసం మొదలయ్యే వరకూ స్ఫూర్తిదాయకమైన గీతాలను తలచుకుందాం. పట్టుదల సినిమా కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఓ చక్కని పాటతో ఈ సిరీస్ మొదలు పెడదాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈపాట గురించి సిరివెన్నెల గారి వివరణతో కూడిన వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని వీడియో క్వాలిటీ బాలేనందున ఆడియో ఎంబెడ్ చేస్తున్నాను అది ఇక్కడ చూడవచ్చు. వీడియో చూడాలనుకున్నవారు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పట్టుదల (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.జే. ఏసుదాస్

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

 
నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది 
నెత్తురుంది సత్తువుంది 
ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా 
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది 
నీకె నువ్వు బాసటైతే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి


నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న 
గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న 
చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
హుంకరిస్తే దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతం ఆపలేని 
జ్వాల ఓలె ప్రజ్వలించరా 
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.