బుధవారం, జనవరి 31, 2018

సందమామ కంచమెట్టి...

రాంబంటు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాంబంటు (1996)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి  
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, చిత్ర 

సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి


భద్రాద్రి రామన్న పెళ్లికొడుకవ్వాల
సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల
బాసరలో సరస్వతి పసుపూకుంకుమలివ్వాల

విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు

బుగ్గపండు కోరకడు పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు
ఆవులింతలంటాడు అవకతవకడు

సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి


ఏడుకొండల సామి ఏదాలు చదవాల 
సెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల 
 అన్నవరం సత్తెన్న అన్నవరాలివ్వాల 
సింహాద్రి అప్పన్న సిరిసేసలివ్వాల 
 
పెదవి తెనేలందిస్తే పెడమోములు
తెల్లరిపోతున్నా చెలి నోములు
పెదవి తెనేలందిస్తే పెడమోములు
తెల్లరిపోతున్నా చెలి నోములు

పిల్లసిగ్గు చచ్చిన మల్లెమొగ్గ విచ్చిన
కదలడు మెదలడు కలికి పురుషుడు
అందమంతా నీదంటే అవతారుడు
అదిరదిరి పడతాడు ముదురుబెండడు

 సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి 

2 comments:

కళ్ళుమూసుకుని వింటే హాయిగా ఉంటుంది సుమండీ..

చిత్రీకరణ కూడా పర్లేదు శాంతి గారు.. కాకపోతే చూసినప్పటికన్నా వింటే కొంచెం ఎక్కువ నచ్చే పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.