మంగళవారం, జనవరి 30, 2018

చూడు చూడు చందమామ...

పెళ్ళి కొడుకు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళికొడుకు (1994)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి  
సాహిత్యం : ?? ఆరుద్ర/సినారె
గానం : చిత్ర 

చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు
చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు
పక్కగదిలో ఒక్కదాన్ననీ
పక్కగదిలో ఒక్క దాన్ననీ
పక్కమీద చేరేట్టున్నాడు
నా పక్కమీద చేరేట్టున్నాడు

చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు
చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు

తడిసినా కురులను దువ్వి
జడ వేయనా అంటూ
మెడమీద పుట్టుమచ్చనూ
తడిమేయనా అంటూ
ఈ ఉదయం అన్నాడూ
ఎలా ఎలాగో ఉన్నాడూ
ఆదమరచి పడుకుంటే
అల్లరి చేసేట్టున్నాడు
తెగ అల్లరి చేసేట్టున్నాడు
హహహ చూడు చూడు

చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు
చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు

ఎదపైన పయ్యెద లాగా
ఒదిగిపోనా అంటూ
చిరునడుము పిడికిట పొదిగీ
సరి చూడనా అంటూ
సాయంత్రం అన్నాడు
సన్న సన్నగా నవ్వుకున్నాడు
వీలు చిక్కితే ఓరినాయనో
వీలు చిక్కితే ఓరినాయనో
కిటికీలోంచి దూకేట్టున్నాడు
నా అందమంత దువ్వేట్టున్నాడు

చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు
చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు

మల్లెపూల మాటునున్న చందమామ
ఈ చిన్నోడి చేష్టలు చూస్తున్నావా
చూస్తున్నావా చూస్తున్నావా
పండు వెన్నెల మత్తు చల్లి
పైరగాలి జోలపాడీ
మెల్ల మెల్లగా జో కొట్టవా
ఈ అల్లరోడ్ని పడుకోబెట్టవా
కాకుంటే కొంపదీసి ఈ రాతిరే
కొల్లగొట్టి పోయేట్టున్నాడు
నన్ను కొల్లగొట్టి పోయేట్టున్నాడు

చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు
చూడు చూడు చందమామ చూడు
ఈ కోడెగాడు నిద్దరే పోడు


4 comments:

అందాలు అరబోసే పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

this song is not written by Sri Veturi, pl check audio label of the film

థాంక్సండీ టైటిల్ కార్డ్స్ లో ఆరుద్ర సినారే గార్లున్నారు వారిలో ఒకరై ఉండవచ్చు. పోస్ట్ సరిచేశాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.