శుక్రవారం, జనవరి 19, 2018

సిత్రాలు సేయరో...

మనవూరి పాండవులు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనవూరి పాండవులు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
శివుడా..శివమెత్తి పాడరో నరుడో నరుడా..
నువ్వు..సిందేసి ఆడరో నరుడో నరుడా..ఆ..ఆ..
తథిన థినకు ధిన..తథిన థినకు థిన..తథిన థినకు థిన
తక..తక..తక..తక..తక..

సిత్రాలు సేయరో శివుడో శివుడా..
శివమెత్తి పాడరో నరుడో నరుడా..
ఆ..నువ్వు సిందేసి ఆడరో నరుడో నరుడా..


అండపిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే..
అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే..
అండపిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే..
అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే..

సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
శివుడా..శివమెత్తి పాడరో నరుడో నరుడా..
నువ్వు..సిందేసి ఆడరో నరుడో నరుడా..ఆ..ఆ..


యాపకాయకన్న ఇసం..ఏమి పుచ్చకాయరా..
పాడుబుద్ది దొరగోరూ..పాముకన్న ఇసంరా..
యాపకాయకన్న ఇసం..ఏర్రి పుచ్చకాయరా..
పాడుబుద్ది దొరగోరూ..పాముకన్న ఇసంరా..

నమ్మించే దగాకోరూ..నాభికన్న ఇసంరా
నమ్మించే దగాకోరూ..నాభికన్న ఇసంరా
ఇన్ని ఇసాలు దిగిమింగే..ఏ..ఏ..ఎర్రోడే గొప్పోడురా..

సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
శివుడా..శివమెత్తి పాడరో నరుడో నరుడా..
కాస్త మందేసి ఆడరో నరుడో..నరుడా..


కాని పనులు సేసినోడూ..ఊ..ఊ..భూమి ఏలుతున్నాడూ...
మంచి బుద్దులున్నోళ్ళూ..ఊ..ఊ..మట్టి కరుస్తున్నారూ...
కాని పనులు సేసినోడూ..ఊ..ఊ..భూమి ఏలుతున్నాడూ...
మంచి బుద్దులున్నోళ్ళూ..ఊ..ఊ..మట్టి కరుస్తున్నారూ...

నిన్నే బుకాయించినోన్ని..సీమయినా కుట్టదే..
శివుడూ నిన్నే..
నిన్నే బుకాయించినోన్ని..సీమయినా కుట్టదే..
మతిపోయిన పిచ్చితల్లి..మాటెవరికీ పట్టదే..

అదే సిత్రం..
సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..శివుడా..
శివమెత్తి పాడరో నరుడో నరుడా..
నువ్వు..సిందేసి ఆడరో నరుడో నరుడా..ఆ..ఆ..
రయ్యాకు తాధిమి..కునకు తాధిమి..రయ్యకు తాధిమి..త్తా


1 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ రెబల్ స్టార్ ఫాన్స్..నాకు కృష్ణం రాజుగారు పెద్దగా నచ్చరు..ఈ సినిమాలో, భక్త కన్నప్ప లో తప్ప..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.