గురువారం, జనవరి 25, 2018

నల్లా నల్లని కళ్ళూ...

కలియుగ రావణాసురుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కలియుగ రావణాసురుడు (1980)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : బాలు

నల్లా నల్లని కళ్ళూ
నవ్వీ నవ్వని కళ్ళూ
చూసినట్టే చూసి
తలుపులు మూసేసుకున్న కళ్ళూ
నల్లానల్లని కళ్ళూ


తొలిపొద్దులో తామర కళ్ళూ
మలిసందెలో కలువ కళ్ళూ
ఏటిపాయలో చేప కళ్ళూ
తోటమలుపులో లేడి కళ్ళూ
ఎన్నాళ్ళు చూసినా
ఎన్నేళ్ళు చూసినా
లోతులందని కళ్ళూ
నాలోకమేలే కళ్ళూ

ఏమి చక్కని కళ్ళూ
రామ చక్కని కళ్ళూ


సిగ్గును చీరగా కప్పుకుని
చిలిపిగా ఓరగా తప్పుకుని
చిరు చిరు నవ్వులు
చుర చుర చూపులు
కలియబోసి ముగ్గులేసి
రారమ్మని పోపొమ్మని
ఇపుడొద్దని సరెలెమ్మనీ
ఊరించే కళ్ళూ
సరసాలకూ శంఖం పూరించే కళ్ళూ

ఏమి చక్కని కళ్ళూ
రామ చక్కని కళ్ళూ


ఆవులించే కళ్ళూ
ఆకలేసిన కళ్ళూ
రైక తొడిగిన కళ్ళూ
పైట తొలగిన కళ్ళూ
కసిరి వల విసిరి
వలపు కొసరి కొసరి
మగతను ఎగదోసే కళ్ళూ
మనసును నమిలేసే కళ్ళూ
ఆ కళ్ళే నడివేసవి వడగళ్ళూ
ఆ కళ్ళే నా కలల పొదరిళ్ళూ

లోతులందని కళ్ళూ
నా లోకమేలే కళ్ళూ
ఏమి చక్కని కళ్ళూ
రామ చక్కని కళ్ళూ  

1 comments:

కన్నుల అందాని బాపు, వంశీలు చూపినట్టుగా ఇంకెవరూ చూపించలేరనిపిస్తుంటుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.