ఆదివారం, జనవరి 21, 2018

రాకోయీ అనుకోని అతిథి...

రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్   (1976)
సంగీతం : పెండ్యాల  
సాహిత్యం : దేవులపల్లి/పాలగుమ్మి ?
గానం : సుశీల    

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైనా పంపక
రాకోయీ అనుకోని అతిథి

వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనే లేదు
వేళ కాని వేళా
ఈ వేళ కాని వేళ.. ఇంటికి

రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ

సిగలో పూవులు ముడవాలంటే
సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు
పంచభక్ష్యముల చేయనే లేదు

వేళ కాని వేళా
ఈ వేళ కాని వేళ... విందుకు
రాకోయీ అనుకోని అతిథి... రాకోయీ 

ఊరక దారినె పోతూ పోతూ అలసి వచ్చితివో?
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో?
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో?
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుటా మరియాద కాదది

వేళ కాని వేళా
ఈ వేళ కాని వేళ త్వరపడి

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైన పంపక
రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ

1 comments:

జయప్రద..అద్భుతహ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.