ఆదివారం, జనవరి 28, 2018

నల్లాని వాడే కోయిలాలో...

బుల్లెట్ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బుల్లెట్ (1985)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : వేటూరి 
గానం : వాణీజయరాం

నల్లాని వాడే కోయిలాలో
నవ్వుతూ ఉందురే కోయిలాలో
వరహాల రాజులే కోయిలాలో
వాడి తరహాలు చూడవే కోయిలాలో

నల్లాని వాడే కోయిలాలో
నవ్వుతూ ఉందురే కోయిలాలో
వరహాల రాజులే కోయిలాలో
వాడి తరహాలు చూడవే కోయిలాలో

డిస్కోలో వీరులే అమ్మలారో
మస్కా మారాజులే కొమ్మలారో
చూస్కో ఆ ఒడ్డు పొడుగు చుక్కలారో
కాస్కోవే దెబ్బకు దెబ్బ అబలారో
కంటికి గురి గలవారు కండల సిరిగల వారు
సయ్యాటల్లో సమరక్రీడల్లో ఓ 

నల్లాని వాడే కోయిలాలో
నవ్వుతూ ఉందురే కోయిలాలో
పరిహాసమాడకే కోయిలాలో
వారు ధరహాస వీరులే కోయిలాలో

కొంగు అందిస్తే చాలు కొమ్మలారో
కోకంటూ ఉండదే అమ్మలారో
ముద్దంటూ చేరినా వనితాలారో
ముచ్చట్లు పొందురే ముదితలారో
రమణులు పదహారు వేలు
రసికతలో సరిలేరు
రమణులు పదహారు వేలు
రసికతలో సరిలేరు
రాత్రీ పగలు రాసక్రీడల్లో ఓ

నల్లాని వాడే కోయిలాలో
నవ్వుతూ ఉందురే కోయిలాలో
నటన సూత్రధారులే కోయిలాలో
వారు కపట వేషధారులే కోయిలాలో

2 comments:

వాణీజయరాంగారి గొంతు యే పాటలోనైనా అద్భుతంగా ఉంటుం

అవును శాంతిగారు నిజం చెప్పారు.. ఆవిడ గొంతులో భలే ఇంట్రెస్టింగ్ గా ఉందీ పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.