బుధవారం, జనవరి 24, 2018

పండంటి జీవితం...

పండంటి జీవితం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పండంటి జీవితం (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

పండంటి జీవితం... రెండింటికంకితం
పండంటి జీవితం...  రెండింటికంకితం
ఒకటి నీ మనసు... ఒకటి నీ మమత
మమత ఉన్న మనసు కన్న
ఏది శాశ్వతము

పండంటి జీవితం... రెండింటికంకితం

చిలకపచ్చని చీరకట్టి
మొలక నవ్వుల సారె పెడితే
పులకరింతల పూలు తెస్తున్నా
పులకరింతల పూలు తెస్తున్నా

చిలిపి కన్నుల పలకరించి 
వలపు వెన్నెల చిలకరిస్తే
కౌగిలింతకు నేను వస్తున్నా
కౌగిలింతకు నేను వస్తున్నా

ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను
ఆ మాట నువ్వంటే నే దొరకను
ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను
ఆ మాట నువ్వంటే నే దొరకను

ఆ... ఇంత హొయలు...
ఇన్ని లయలు నాకు శాశ్వతము

పండంటి జీవితం... రెండింటికంకితం
ఒకటి నీ మనసు... ఒకటి నీ మమత
మమత ఉన్న మనసు కన్న
ఏది శాశ్వతము

పండంటి జీవితం... రెండింటికంకితం


సందెగాలికి జలదరించే
అందమంతా విందు చేస్తే
వలపు పానుపు పరచుకుంటున్నా
వలపు పానుపు పరచుకుంటున్నా

హాయి తీపిని మోయలేక
సాయమడిగి సరసకొస్తే
మల్లెచెండే దిండు చేస్తున్నా
మల్లెచెండే దిండు చేస్తున్నా

ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా
నా ఇల్లు నాకుంటే అది చాలుగా
ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా
నా ఇల్లు నాకుంటే అది చాలుగా

మనసు ఉన్న మనువు కన్న
ఏది శాశ్వతమూ... ఊ...

పండంటి జీవితం... రెండింటికంకితం

ఒకటి నీ మనసు... ఒకటి నీ మమత
మమత ఉన్న మనసు కన్న
ఏది శాశ్వతము

పండంటి జీవితం... రెండింటికంకితం

 

1 comments:

శోభన్ బాబు అభిమానులకి నచ్చే పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.