గురువారం, జనవరి 18, 2018

రాముడేమన్నాడోయ్...

అందాల రాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : రామకృష్ణ

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్
రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్

మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమన్నాడోయ్

మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్
మురగపెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్
పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్

పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్
పూచికపుల్లైన వెంట రాదన్నాడోయ్
పుణ్యమొక్కటే చివరకు మిగులునన్నాడోయ్... 
డొయ్ డోయ్ డోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమన్నాడోయ్

మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్ అహా
న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్
మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్ అహా
న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్

గొప్పకొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్
గొప్పకొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్
అప్పుచేసి పప్పుకూడు వలదన్నాడోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా.. రాముడేమన్నాడోయ్

కొండమీద కోతులను కొనలేరోయ్ డబ్బుతో
బండరాతి గుండెలను మార్చెనోయ్ మంచితో

నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్
నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్
కొందరు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమన్నాడోయ్

రావణుడి కాష్టమింకా రగులునన్నాడోయ్
నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్
రావణుడి కాష్టమింకా రగులునన్నాడోయ్
నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్

నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడొయ్
నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడొయ్
నీలో గల సైతానుని చంపమన్నాడోయ్... 
డోయ్ డొయ్ డోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్

రాముడేమన్నాడోయ్...
సీతా రాముడేమ్మాన్నాడోయ్

1 comments:

ఇలాంటి పాటలు నేర్చుకుంటే జీవితపు చిన్న చిన్న నిజాలు అర్ధమౌతాయి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.