బుధవారం, జనవరి 17, 2018

దారి చూడు దుమ్ము చూడు...

చాలా రోజుల తర్వాత సీమ తెలుగులో ఓ మాంచి ఫోక్ సాంగ్ విన్న ఫీలింగ్ అందించిన ఓ పాటను ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం : హిప్ హాప్ తమిళ
సాహిత్యం : పుట్టా పెంచల్ దాస్
గానం : పుట్టా పెంచల్ దాస్ 

పార్టీ అని మెల్లగా అడుగుతారేందిరా
చిత్తూరు జిల్లా మొత్తం
మన పలకల శబ్దం ఇనపడాలా
స్టార్ట్ మూజిక్

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల వేరే చూడు
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల వేరే చూడు
కమలపూడి
కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ
కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ

బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా 
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా 
చక్కని చుక్క
చక్కని చుక్కా దక్కే చూడూ మామా
చిత్ర కన్ను కొంటేవాడా
చిత్ర కన్ను కొంటేవాడా
చిత్ర కన్ను కొంటేవాడా
 

 
మేడలోనీ కుర్రదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావో
మేడలోనీ కుర్రదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావో
నిన్ను కోరి
నిన్ను కోరి వన్నెలాడీ లైలా
కొట దాటీ పేటా చేరే

కురస కురస అడివిలోనా పిలగా
కురిసెనే గాంధారీ వానా
కురస కురస అడివిలోనా పిలగా
కురిసెనే గాంధారీ వానా
ఎక్కరానీ ఎక్కరానీ కొండలెక్కీ మావ
ప్రేమలోనా చిక్కీనావూ
ఎక్కరానీ కొండలెక్కీ మావ
ప్రేమలోనా చిక్కీనావూ


పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా
ఊరు వాడా తోడు రాగా
పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా
ఊరు వాడా తోడు రాగా
జంటగానే జంటగానే కూడినారూ మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారూ మామ
చలువ పందిరి నీడ కిందా



1 comments:

నాని యే స్టైల్లో చేసినా చూడడానికి బావుంటుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.