సోమవారం, జనవరి 22, 2018

జోజో లాలి జోలాలిజో...

పేరెంట్స్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడప్ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పేరెంట్స్ (2012)
సంగీతం : ఎస్.కె.బాలచంద్రన్
సాహిత్యం : వనమాలి
గానం : జై స్వప్న

జోజో లాలి జోలాలిజో
జోజో లాలి జోలాలిజో
రారానాన్నా నా ఒడికీ
రూపం నేనే నీ కలకీ
విడిచే శ్వాసతో కలిసే పాశమే
కనులే కరిగే ఈ క్షణమే
ఎదనే తొలిచే నీ రుణమే

జోజో లాలి జోలాలిజో
జోజో లాలి జోలాలిజో
రారానాన్నా నా ఒడికీ
రూపం నేనే నీ కలకీ


నిను చూసే నిముషంలో నిన్నల్లుకోదా
మది నీతో ప్రతి హాయి పంచేసుకోదా
ప్రేమ మీరగా అమ్మా అన్నమాటనే
విన్నవెంటనే నీకే చేరువవ్వదా
విడిచే శ్వాసతో కలిసే పాశమే
కనులే కరిగే ఈ క్షణమే
ఎదనే తొలిచే నీ రుణమే

జోజో లాలి జోలాలిజో
జోజో లాలి జోలాలిజో
రారానాన్నా నా ఒడికీ
రూపం నేనే నీ కలకీ


గానం : ఎస్.కె.బాల చంద్రన్

దాయి దాయి దాయమ్మనీ
నిన్నే చేరే దారిదని
నీకై రానీ నీవాడిని
ప్రాణం కోరే నీ ఒడినీ
గతమే చూపనీ నిజమే చూడనీ
జతగా కలిసే ఊపిరిలో
ఎప్పుడూ కనని ఊగిసలో
దాయి దాయి దాయమ్మనీ
నిన్నే చేరే దారిదనీ
నీకై రానీ నీవాడిని
ప్రాణం కోరే నీ ఒడినీ


ఒకసారి ఒడిలోన నీ జోలపాటే
వినుకుంటూ నిదురోనీ నా కంటిపానీ
చందమామనే చూస్తూ గోరుముద్దలే
ఆరగించనీ నీతో ఆశ తీరగా
గతమే చూపనీ నిజమే చూడనీ
జతగా కలిసే ఊపిరిలో
ఎప్పుడూ కనని ఊగిసలో

దాయి దాయి దాయమ్మనీ
నిన్నే చేరే దారిదనీ
నీకై రానీ నీవాడిని
ప్రాణం కోరే నీ ఒడినీ

2 comments:

వేణూజీ..వేటూరివారు చెప్పినట్టు అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన..అమ్మ వెళ్ళినా ఆ మాటలెప్పుడూ మదిలో మెరుస్తూనే ఉంటాయి..ఙాపకాల జల్లులతో మనసుని తడిచేస్తుంటాయి..we all are with you..

మంచి పాటను గుర్తు చేశారు శాంతిగారు. థాంక్స్ ఫర్ యువర్ నైస్ వర్డ్స్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.