ఆదివారం, జనవరి 14, 2018

కళ్యాణం గోదా కళ్యాణం...

మిత్రులందరకూ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ధనుర్మాసపు చివరి రోజు గోదాకళ్యాణం సందర్బంగా గోదా కళ్యాణం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ప్రజెంటేషన్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గోదాకళ్యాణం
సంగీతం : నాగరాజు తాళ్ళూరి
సాహిత్యం : వేదవ్యాస్/ఉదయభాస్కర్  
గానం : మాళవిక. మణి నాగరాజు

కళ్యాణం గోదా కళ్యాణం
వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం
కళ్యాణం గోదా కళ్యాణం
వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం

కలియుగమున కర్కట మాసమున
పుత్తడి పుబ్బా నక్షత్రమున
పుడమిని సీతా సతివలె తులసీ
వనమున విరిసిన వరాల తల్లీ

కళ్యాణం గోదా కళ్యాణం
వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం

ధనుర్మాసమున వ్రతమును చేసి
ధ్వయమంత్ర పాశురములు పాడీ
ముడిచిన విరులను ముకుందనికొసగీ
జతగా కూడిన జగదేక జననీ

కళ్యాణం గోదా కళ్యాణం
వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం

సచీదేవి తిలకమును దిద్దగా
సరస్వతి మణి బాసికము కట్టగా
పార్వతీ పారాణి పెట్టగా
వధువయీ వరలిన వసుధాదేవీ

కళ్యాణం గోదా కళ్యాణం
వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం

పరిమళ తైలము పూసీ శ్రీలక్ష్మీ
శ్రీహరీ కురులను దువ్వగా
మేళా దేవి కస్తూరి తిలకమును తీర్చగా
రంగడు వరుడై రంజిల్లు

కళ్యాణం గోదా కళ్యాణం
వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.