శనివారం, అక్టోబర్ 10, 2020

మల్లెలు పూసే.. వెన్నెల కాసే..

ఇంటింటి రామాయణం సినిమా కోసం వేటూరి గారు అద్భుతంగా రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. రాజన్ నాగేంద్రలలో రాజన్ గారు చెప్పే మాటలు. ఇప్పటికీ వారి ముందు పాడాలంటే భయమేస్తుందనే బాలు గారి వినయం ఇతర విశేషాలు వీడియోలో పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులే.. నీ విరజాజులై
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ...

తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
 కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కా...సే.. ఈ రేయి హాయిగా
 


శుక్రవారం, అక్టోబర్ 09, 2020

ఆడవే మయూరీ...

చెల్లెలి కాపురం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట నిజానికి ఘంటసాల గారు పాడాల్సిన పాటట. ఆయన ఆరోగ్యం బాగోలేక కనీసం ట్రాక్ పాడిద్దామని బాలు గారికి అవకాశం ఇచ్చారట. పాడడంలో సినారే గారి ప్రోత్సాహం ఎంతో ఉందని బాలు చెప్పిన విశేషాలు పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చెల్లెలి కాపురం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె 
గానం : బాలు

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగామ్ములూగగా
వినీల గజభర.. విలాస బంధుర.. 
తనూలతిక చంచలించిపోగ

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకును గని నా పలుకు విరియ 
నీ నటనను గని నవ కవిత వెలయగ
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

అది యమునా సుందర తీరము 
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల 
అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక
అట సాగెను విరహిణి రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన 
రసమయ మురళీ గీతిక

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నా పలుకులకెనెయగు కులుకు చూపి 
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

ఫాల నేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని కోలు పడి రతీదేవి దుఖిఃతమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల.. 
జలిత దిక్ తటుల.. జహిత దిక్కరుల.. వికృత
ఘీంకృతుల.. సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన.. కనుబొమలలోన.. 
అధరమ్ములోన.. వదనమ్ములోన
కనులలోన.. కనుబొమలలోన.. 
అధరమ్ములోన.. వదనమ్ములోన
గళసీమలోన.. కటిసీమలోన.. 
కరయుగములోన.. పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన.. 
అనంత విధముల అభినయించి 
ఇక ఆడవే.. ఆడవే .. ఆడవే.. 
 

గురువారం, అక్టోబర్ 08, 2020

కలువకు చంద్రుడు...

చిల్లర దేవుళ్ళు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట రికార్డింగ్ సమయంలో "జలుబు చేసింది నేను పాడలేను" అన్నారట బాలు గారు. "ఈ పాటకు నీ జలుబు గొంతే అద్భుతంగా సూట్ అవుతుంది" అంటూ మహదేవన్ గారు పాడించుకున్నారని బాలు చెపిన విశేషాలు పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో దొరకలేదు యూట్యూబ్ లో సరిగమ ఆడియో ఇక్కడ వినవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ
అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

వలపు కన్నా తలపే తీయనా
కలయక కన్నా కలలే తీయనా
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా
నేటికన్న రేపే తీయనా

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ
వలపా మనసుకు అందానిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికి.. మనిషికి.. తేడా ఏముంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
 


బుధవారం, అక్టోబర్ 07, 2020

మేడంటే మేడా కాదు...

సుఖదుఃఖాలు సినిమాలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. పాట పాడాక కోదండపాణి గారి గురించి బాలు గారు చెప్పిన మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సుఖదుఃఖాలు (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

నేనైతె ఆకు కొమ్మ 
తానైతె వెన్నెల వెల్ల
నేనైతె ఆకు కొమ్మ 
తానైతె వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన 
పొదరిల్లు మాది  

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

కోవెలలొ వెలిగే దీపం 
దేవి మా తల్లి
కోనలలో తిరిగే పాటల 
గువ్వ మా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు 
గొరవంక గాని
వంకంటే వంకా కాదు 
నెలవంక గాని

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

గోరింక పెళ్ళైపొతే 
ఏ వంకో వెళ్ళిపొతే
గోరింక పెళ్ళైపొతే 
ఏ వంకో వెళ్ళిపొతే
గూడంతా గుబులై పోదా 
గుండెల్లో దిగులై పోదా 

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది
 


మంగళవారం, అక్టోబర్ 06, 2020

పూలు గుసగుసలాడేనని..

శ్రీవారు మావారు సినిమా కోసం కృష్ణగారికి పాడిన ఈ పాట మాతృక హిందీ పాట. వినీ వినీ ఆ విషయమే మర్చిపోయాను నేను తెలుగు పాటనే అనుకుంటూ ఉంటాను. ఇక స్వరాభిషేకం లో పాడాక "ఈ రోజు కూడా రెండు సార్లు రిహార్సల్ చేస్తే కానీ నోట్ పట్టుకోలేకపోయాను" అని వినయంగా చెప్తున్న బాలు గారికి నమస్కరించకుండా ఉండగలమా. అన్నట్లు ఈ పాటలో గిటార్ ప్లే చేసింది ఇళయరాజా గారట.  

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీవారు మావారు (1973)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : సినారె
గానం : బాలు      

పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. హా.... 

పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా.... 

లాలలలల లాలల... లలలాలలల.. 
లాలలలల లాలల... లలలాలలల..

మబ్బుకన్నెలు పిలిచేనని..
మనసు రివ్వున ఎగిసేనని..
వయసు సవ్వడి చేసేనని.. 
ఇపుడే తెలిసిందీ....
రు రు రు రు..ఆ..ఓ 

పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ.... 

అలలు చేతులు సాచేనని..
నురుగు నవ్వులు పూచేనని..
నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ..!!
రు రు రు రు..ఆ.. ఓ..

పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ....
టుర్..ఆ ఆ హు...ఆ హు..

టుర్..ఆ ఆ హు...ఆ హు.

పైరు పచ్చగ ఎదిగున్నది...
పల్లెపడుచుల విసురున్నది...
కొత్త సొగసే రమ్మన్నది...
గుండె ఝుమ్మన్నది... 

రు..రు..రు..రు... హో..హొ..

పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ....
 


సోమవారం, అక్టోబర్ 05, 2020

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు...

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "అందమైన అనుభవం" సినిమాలోని ఈ పాట అప్పట్లో నలభై ఏళ్ళ క్రితం ఎంత హుషారుగా పాడారో ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అంతే హుషారుగా పాడారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు
చెలిమికెపుడూ జతగాళ్ళు చెడుపుకెపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాతసంకెళ్ళు
మనుషులె మన నేస్తాలు కమాన్ క్లాప్.. మనసులె మన కోవెల్లు
మనుషులె మన నేస్తాలు మనసులె మన కోవెల్లు..యెవ్రీబడీ
మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు ..
కమాన్ యెవ్రీబడీ జాయిన్ టుగెదర్..



ఆదివారం, అక్టోబర్ 04, 2020

పల్లవించవా నా గొంతులో...

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "కోకిలమ్మ" సినిమాలోని ఈ పాట బాలుగారి లలితమైన స్వరాన్ని పట్టి చూపించే పాట. బాలచందర్ గారి ఆస్థాన సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి మధురమైన బాణీ ఆత్రేయ గారి సాహిత్యం కలసి కథానాయకుడి ప్రేమని మన కనుల ముందుంచేస్తాయి.

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా 
నా బ్రతుకు నీది కాదా

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని 
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని 
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ 
ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ 
ఇదే నాకు వరమని

చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని 
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని 
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని 
ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని 
ఇదే నిజం అనమని

చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా 
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో 
 


శనివారం, అక్టోబర్ 03, 2020

నీవుంటే వేరే కనులెందుకూ...

బాపురమణలు సృష్టించిన "స్నేహం" చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఇది రాజేంద్రప్రసాద్ మొదటి సినిమా అండ్ సాయికుమార్ యుక్తవయసుకు వచ్చాక చేసిన మొదటి సినిమా కూడా అట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమా లోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : స్నేహం (1977)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు

నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె

నీవుంటె వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె
నీవుంటే వేరే కనులెందుకూ

నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నీ చేయి తాకితే..తీయని వెన్నెల
చేయి తాకితే.. తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు

నీవుంటె వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె
నీవుంటే వేరే కనులెందుకూ

నిన్న రాతిరి ఓ.. కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
నిన్న రాతిరి ఓ..కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
చందమామ కావాలా.. 
ఇంద్రధనువు కావాలా
అమ్మ నవ్వు చూడాలా.. 
అక్క ఎదురు రావాలా
చందమామ కావాలా.. 
ఇంద్రధనువు కావాలా
అమ్మ నవ్వు చూడాలా.. 
అక్క ఎదురు రావాలా
అంటూ అడిగిందీ దేవత అడిగిందీ
అప్పుడు నేనేమన్నానో తెలుసా

...వేరే కనులెందుకనీ 
నీకంటే.. వేరే బ్రతుకెందుకనీ
లాలాల లాల లలలలలాల...
లాలాల లాల లలలలలాల...
 


శుక్రవారం, అక్టోబర్ 02, 2020

నా పేరు బికారి...

శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం కోసం బాలు గారు అద్భుతంగా గానం చేసిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటలో హార్మోనియం వాయించిన వారు మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణుగారట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. ఒరిజినల్ సినిమా వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు

నా పేరు బికారి నా దారి ఎడారి..
మనసైన చోట మజిలీ..
కాదన్న చాలు బదిలీ..
నా దారి ఎడారి నా పేరు బికారి 
నా దారి ఎడారి నా పేరు బికారి

తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు

విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
అసలు నా మరోపేరు ఆనంద విహారి 

నా దారి ఎడారి నా పేరు బికారి 
నా దారి ఎడారి నా పేరు బికారి

మేలుకొని కలలుగని మేఘాల మేడపై
మెరుపుతీగలాంటి నా ప్రేయసినూహించుకొని

ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని
ఆ.... ఆ...... ఆ..... ఆ.....
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని
ఆకాశవీధిలో పయనించు బాటసారి 

నా దారి ఎడారి నా పేరు బికారి 
నా దారి ఎడారి నా పేరు బికారి

కూటికి నే పేదను గుణములలో పెద్దను
కూటికి నే పేదను గుణములలో పెద్దను
సంకల్పం నాకు ధనము సాహసమే నాకు బలం

ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి 

నా దారి ఎడారి నా పేరు బికారి
నా పేరు బికారి నా దారి ఎడారి
 

గురువారం, అక్టోబర్ 01, 2020

ఏ దివిలో విరిసిన...

తను పాడిన వేల కొద్దీ పాటలనూ, తను పంచుకున్న బోలెడు సినిమా కబుర్లనూ, జ్ఞాపకాలనూ మనకి వదిలి పెట్టి దివికేగిన బాలూ గారి స్మృతిలో ఈ అక్టోబర్ నెలంతా ఆయన పాడిన పాటలను తలచుకుందాం. 

బాలూ గారి కోసం తల్చుకుంటున్నాం కనుక ఆయన ఆయా పాటల గురించిన విశేషాలు పంచుకుంటూ స్వయంగా మళ్ళీ పాడి వినిపించిన స్వరాభిషేకం వీడియోలు ముఖ్యంగా ఎంబెడ్ చేస్తున్నాను. ఈ భువిలో విరిసిన పారిజాతం బాలూ గారికి చాలా ఇష్టమైన ఓ చక్కని పాటతో ఈ సిరీస్ మొదలు పెడదాం. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈ టీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. ఒరిజినల్ సినిమా వీడియో ఇక్కడ చూడవచ్చు. జానకి గారు పాడిన వర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.    


చిత్రం : కన్నెవయసు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : బాలు

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..
 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
 
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో 
 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.