మంగళవారం, జనవరి 10, 2017

గోవింద మాధవ దామోదరా...

సీతారామ కళ్యాణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలి పెంచలనరసింహారావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం :ఘంటసాల వెంకటేశ్వరరావు

గోవింద మాధవ దామోదరా
జయ గోవింద మాధవ దామోదరా,
జగదానంద కారణ నారాయణా
జయ గోవింద మాధవ దామోదరా

కృతులు హరించీ జలనిధి దాగిన
కృతులు హరించీ జలనిధి దాగిన
సోమక దానవు ద్రుంచీ.... 
వేదోద్ధరణము చేసిన వీరా..
మీనాకార శరీరా నమో మీనాకార శరీరా

పాల సముద్రము బానగ జేసి
పాల సముద్రము బానగ జేసి
మందర శైలము కవ్వము జేసి
వాసుకి కవ్వపు త్రాటిని జేసి
వాసుకి కవ్వపు త్రాటిని జేసి
సురదానవులు తఱచగా
గిరిని మోసిన కూర్మ శరీరా నమో
గిరిని మూపున మోసిన కూర్మ శరీరా

పుడమిని బట్టి చాపగా జుట్టి
పుడమిని బట్టి చాపగా జుట్టి
కడలిని దాగిన హిరణ్యాక్షుని
కోరను గొట్టీ ధారుణి గాచిన
వీర వరాహ శరీరా నమో వీర వరాహ శరీరా

సర్వమయుడవగు నిను నిందించే
సర్వమయుడవగు నిను నిందించే
హిరణ్య కశిపుని హిరణ్య కశిపుని వధియించీ
ప్రహ్లాదుని పరిపాలన జేసిన నరసింహాద్భుత రూపా
నమో నరసింహాద్భుత రూపా

సురలబ్రోవ మూడడుగుల నేల
సురలబ్రోవ మూడడుగుల నేల
బలిని వేడి ఆ..ఆ..ఆ.. బలిని వేడి
ఇల నింగిని నిండీ
మూడవ పాదము బలి తలమోపిన
వామన విప్ర కుమారా
నమో! వామన విప్ర కుమారా

ధరణీ నాధుల శిరముల గొట్టీ
ధరణీ నాధుల శిరముల గొట్టీ
సురలోకానికి నిచ్చెనగట్టీ,
తండ్రికి రుధిరము తర్పణ జేసిన
పరశుధరా భృగురామా!
నమో పరశుధరా భృగురామా!

గోవింద మాధవ దామోదరా
జయ గోవింద మాధవ దామోదరా
జగదానంద కారణ నారాయణా
గోవింద మాధవ దామోదరా


సోమవారం, జనవరి 09, 2017

రావే రాధ రాణి రావే...

శాంతి నివాసం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవకపోతే ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : ఘంటసాల, జిక్కి

రావే రాధ రాణి రావే
రాధ నీవే కృష్ణుడు నేనే
రమ్యమైన శారద రాత్రి
రాసలీల వేళ ఇదే 
రాసలీల వేళ ఇదే 

రార కృష్ణ రారా కృష్ణ
రాధనేనే కృష్ణుడు నీవే
రమ్యమైన శారద రాత్రి
రాసలీల వేళ ఇదే
రాసలీల వేళ ఇదే

వో౦పులతో సొంపమరి
ఇంపోసగే యమునేది
సుందరి నీ వాలుజడే
సొగసైనా ఆ యమునా
ఓయ్.. నాటితార పోటులు వీరే
నాటి పున్నమ జాబిలి వీడే
రాధనేనే కృష్ణుడు నీవే
రాసలీల వేళ ఇదే
రాసలీల వేళ ఇదే

విరిసిన పూ పొదలెవీ
విరివనిలో విభుడేడి
వికసించే నీ కనుల
వెలిగేనే నీ విభుడు
ఓయ్ మూగబోయే మానస మురళీ
మురిసి మోగే మోహనరవళి
రాధ నీవే కృష్ణుడ నేనే
రాసలీల వేళ ఇదే 
రాసలీల వేళ ఇదే 

దేవి రాధా మాధవ లీల
పావనమ్మూ బృందావనము
మనము రాధాకృష్ణులమేలే
మధురమాయే ఈ వనమూ
మధురమాయే ఈ వనమూ
ఆహ్హాహాఅహహహఅహహ
ఆహ్హాహాఅహహహఅహహ


ఆదివారం, జనవరి 08, 2017

హే మాధవా...

ఈ రోజు వైకుంఠ ఏకాదశి సంధర్బంగా మిత్రులందరికి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఆ శ్రీ మహా విష్ణువుకి నమస్కరిస్తూ ఈ చక్కని పాటలు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియోస్ లోడ్ అవని వాళ్ళు ఇక్కడ మరియూ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ సత్యన్నారాయణ మహత్యం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం :
గానం : ఘంటసాల

హే మాధవా.. మధుసూదనా
కనజాలవా.. ఆఅ..ఆ..
జగన్నాయకా అభయదాయక
జాలము సేయక రావా
హే మురారి కరుణాకర శౌరీ
నా మొరలే వినలేవా
జగన్నాయకా అభయదాయక
జాలము సేయక రావా
హే మురారి కరుణాకర శౌరీ
నా మొరలే వినలేవా

నిన్ను సేవించు నన్ను శోధింప న్యాయమా నీకు దేవా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే దేవా
శ్రీనివాస వైకుంఠ నివాసా దేవా నా గతి నీవే 
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే దేవా
శ్రీనివాస వైకుంఠ నివాసా దేవా నా గతి నీవే

జగము తరియింప కరుణ కురిపించి కావవా దేవ దేవా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
పాలిత మందారా...

హేమాధవా కరుణించవా..
హేమాధవా కరుణించవా..
హేమాధవా కరుణించవా..
హేమాధవా హేమాధవా
హేమాధవా హేమాధవా 

హే మాధవా.. మధుసూదనా
కనజాలవా.. ఆఅ..ఆ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : శ్రీ సత్యన్నారాయణ మహత్యం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం :
గానం : ఘంటసాల 

శ్రీ క్షీరవారాసి కన్యా పతారంభ రమ్య మందస్మితా 
శంఖ చక్రాంకితా కౌస్తుభాలంకృతా 
దివ్య మందార దామోదరా 
నీలధారాధరాకారా విజ్ఞాన సారా 
నిరాకారా.. సాకారా.. ప్రేమావతారా 

ముకుందా సదానందా గోవిందా
సంరక్షితానేక యోగీశ బృందా 
దయాపాంగా సంతోషితానంత 
దాసాంతరంగా ఆఆ ఆఅ

భవదీయ సౌందర్య కారుణ్యలీలా విలాసంబు 
బృందారకాధీశులే చాటలేరన్నా నేనెంత వాడన్ ప్రభో 
దాటగారాని మాయా ప్రవాహంబులో చిక్కి 
వ్యామోహ తాపంబులన్ సొక్కి సోషించి ఘోషించు 
నీ దాసునిన్ చూచి వాత్సల్యమేపారగా బ్రోచి 
సాలోక్యమిప్పించుమా నీదు సాయుజ్యముం గూర్చుమా 
స్వామీ శ్రీ సత్యనారాయాణ.. నమస్తే నమహ.. 


శనివారం, జనవరి 07, 2017

నీ వలపే బృందావనం...

రాధాకృష్ణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : 
గానం : బాలు, సుశీల

రాధా.... కృష్ణా....
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే

నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే

కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిసాయిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
నా రాధ నడతలో ఈ వేళా
నవ వధువు తడబాటు కనిపించెలే
రంగైన ముత్యాల పందిరిలో
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రతనాల తలంబ్రాలు కురిసేనులే

రాధా.... కృష్ణా....
 
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
నీవు నేనూ జీవితమంతా
నవరాగ గీతాలు పాడాలిలే
మన హృదయాలు పూల నావలో
మధుర తీరాలు చేరాలిలే
మధుర తీరాలు చేరాలిలే

రాధా.... కృష్ణా....
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే
రాధా.... కృష్ణా....

రాధా.... కృష్ణా....

 

శుక్రవారం, జనవరి 06, 2017

నీవే దేవునివి నల్లనయ్యా...

నువ్వు వస్తావని చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నువ్వు వస్తావని (2000)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ 
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : సుజాత

నీవే దేవునివి నల్లనయ్యా కాని
నీకెపుడు వేదనలే ఎందుకయ్యా

నీదే విశ్వమని అందురయ్యా అయినా
నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా


లోకం ఆపదలు తీర్చినావు కానీ
నీవే ఆపదలు మోసినావు

ఎన్నో భాదలను ఓర్చినావు అయినా
మోముపైన నవ్వు నీవు చెరగనీవు

నీవే దేవునివి నల్లనయ్యా కాని
నీకెపుడువేదనలే ఎందుకయ్యా

 

గురువారం, జనవరి 05, 2017

నల్లనయ్యా ఎవరని అడిగావా...

మా ఇద్దరి కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మా ఇద్దరి కథ (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ
మురళిని కాలేను.. పింఛమైనా కాను
మురళిని కాలేను.. పింఛమైనా కాను
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ
ఆ..ఆ..ఆ..ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ

వలచిన రాధమ్మనూ..ఊ..ఊ.... విరహాన దించావు
పెంచినమ్మ యశోధనూ..ఊ..ఊ...ఊ... మోసాన ముంచావూ

నీవు నేర్చినదొకటే.... నిను వలపించుకోవటం
నాకు తెలియినదొకటే... నా మనసు దాచుకోవటం
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరని చెప్పాలీ..నేనూ
ఆ..ఆ..ఆ..ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ

వెన్నైనా మన్నయినా...ఆ..ఆ..ఆ..ఆ.. ఒక్కటే అన్నావూ
దొంగవయినా గానీ...ఈ..ఈ..ఈ... దొరవయీ నిలిచావూ
ఎంతా మరవాలన్నా... మనసును వీడిపోననంటావు
ఎంతా కలవరించిన.. కంటికి కానరాకున్నావు
ఏమని చెప్పాలీ నేనూ... ఎవరనీ చెప్పాలీ నేనూ
ఆ..ఆ..ఆ...ఆ

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ
మురళిని కాలేను.. పింఛమైనా కాను
మురళిని కాలేను.. పింఛమైనా కాను
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ
ఆ..ఆ..ఆ..ఆ
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ

 

బుధవారం, జనవరి 04, 2017

వినవే యశోదా...

ప్రేమానురాగం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమానురాగం (1999)
సంగీతం : రామ్ లక్ష్మణ్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : చిత్ర

వినవే యశోదా.. నీ చిన్నీ కన్నయ్యా..
వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లలమ్మబోతే మధురా పురానా
విరిపొదలో దాగాడే నా పైటా లాగాడే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా

వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లలమ్మబోతే మధురా పురానా
విరిపొదలో దాగాడే నా పైటా లాగాడే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
హో.. రాలుగాయీ గోపయ్యా..

గోకులాన వీధుల్లో యమునా తీరానా
ఓ మూల దాగుండి చిలిపిగా రాళ్ళేసి
కన్నెఎదలు వెన్నల్లే దోచేసిన దొంగా
హోలీ రంగులతో నను తడిపే చల్లంగా
వాణ్ణీ వదలొద్దే కథలేవీ వినవద్దే
వాణ్ణీ వదలొద్దే కథలేవీ వినవద్దే
వెంటపడీ వలపే పంచేయ్ అన్నాడే
మంచి మంచి మాటలతో వలలో వేశాడే హాయ్

రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా..

గోపాల బాలుని మోహన మొరళికే
సిరిమువ్వలే మోగే మనసే పులకించి
కన్నులతో రమ్మంటూ కవ్వించే వేళా
నా తలపే తెర తీసే ప్రేమే ఈవాళాఆ
విరహాన వేగీ నిదరే రాకుందీ
విరహాన వేగీ నిదరే రాకుందీ
నను నేనే మరిచీ నే కూర్చున్న వేళ
బాలగోపాలుడికై హృదయం వేచేనే

రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా మరువకే
రాలుగాయీ గోపయ్యా..

గుండెల్లో కొలువుండే స్వామీ గోపయ్యా
పతి దేవుడై నాకు దొరికే కృష్ణయ్యా
గోవిందెపుడూ అందరివాడమ్మా
లోకాల పాలుడు నీ బాలుడమ్మా
పతిగా మాధవునీ నువ్వే ఇచ్చిందీ
పతిగా మాధవునీ నువ్వే ఇచ్చిందీ
మమతానురాగం నువ్వే పంచింది
నీ పదమే ఏనాడూ మా దైవ సన్నిధిలే..

రాలుగాయీ గోపయ్యా దేవుడే
రాలుగాయీ గోపయ్యా దేవుడే
రాలుగాయీ గోపయ్యా.. 

 

మంగళవారం, జనవరి 03, 2017

చిన్నారి కన్నయ్యా...

పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : సుశీల

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు
నీవే కలపాలీ మా మనసులు

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు
నీవే కలపాలీ మా మనసులు

మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
కట్టుకున్న పతికే బరువై కన్నీరై కరిగేను
ఎంత కాలమో ఈ వియోగము
ఇంతేనా ఈ జీవితం బాబూ
పంతాలా పాలాయెనా

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు
నీవే కలపాలీ మా మనసులు 

రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
చిక్కు ప్రశ్నలెన్నోవేసి చిక్కులలో చిక్కాను
బోసినవ్వుతో బుంగమూతితో మార్చాలీ మీ మామను
బాబూ చేర్చాలి మీ నాన్నను

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు
నీవే కలపాలీ మా మనసులు


సోమవారం, జనవరి 02, 2017

వద్దురా కన్నయ్య...

అర్ధాంగి చిత్రం కోసం జిక్కి గారు పాడిన ఓ మధుర గీతం ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అర్ధాంగి (1955)
సంగీతం : బి.ఎన్.ఆర్ (బి.నరసింహరావు)
సాహిత్యం : ఆత్రేయ
గానం : జిక్కి

వద్దురా కన్నయ్య
వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలి
పోవొద్దురా.. అయ్యా.. అయ్యా
వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలి
పోవొద్దురా.. అయ్యా.. అయ్యా
వద్దురా కన్నయ్యా

పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసి పాపలను బూచి పట్టుకెళ్ళే వేళా 
పసి పాపలను బూచి పట్టుకెళ్ళే వేళా

వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలి
పోవొద్దురా.. అయ్యా.. అయ్యా
వద్దురా కన్నయ్యా

పట్టు పీతాంబరము మట్టి పడి మాసేను
పట్టు పీతాంబరము మట్టి పడి మాసేను
పాలుగారే మోము గాలికే వాడేను
పాలుగారే మోము గాలికే వాడేను

వద్దురా వద్దురా కన్నయ్యా

గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా
గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా
గోల చేసి నీ పై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్నా పాడుకోవలెనన్న
ఆడుకోవలెనన్నా పాడుకోవలెనన్న
ఆదటను నేనున్న అన్నిటను నీదానా

వద్దురా..వద్దురా... వద్దురా
కన్నయ్యా.. కన్నయ్యా..

 

ఆదివారం, జనవరి 01, 2017

కన్నయ్య పుట్టిన రోజునే...

మిత్రులందరకీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. దశతిరిగింది చిత్రంలోనుండి ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దశతిరిగింది (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం :
గానం : బాలు, సుశీల

కన్నయ్య పుట్టిన రోజునే
ఒక వేణువు పుట్టింది
ఒకరికొకరు ఏమైనా
రాగం పలికింది
అనురాగం పలికింది

కన్నయ్య పుట్టిన రోజునే
ఒక వేణువు పుట్టింది
ఒకరికొకరు ఏమైనా
రాగం పలికింది
అనురాగం పలికింది

ఏ పల్లె ఏ వాడలో పెరిగినావో
ఈ నాటికీఇంట మము చేరినావు
ఏ పల్లె ఏ వాడలో పెరిగినావో
ఈ నాటికీఇంట మము చేరినావు
నేనోచుకోలేని మమతానురాగం
తొలిసారి నీలోనే చూశాను నేను
నూరేళ్ళు చల్లంగ వర్ధిల్లవమ్మా
నూరేళ్ళు చల్లంగ వర్ధిల్లవమ్మా

కన్నయ్య పుట్టిన రోజునే
ఒక వేణువు పుట్టింది
ఒకరికొకరు ఏమైనా
రాగం పలికింది
అనురాగం పలికింది

నానవ్వు నీతోడుగా పంచుకుంటా
నీ కలత నా కలతగా ఎంచుకుంటా
నానవ్వు నీతోడుగా పంచుకుంటా
నీ కలత నా కలతగా ఎంచుకుంటా
రతనాల విలువైన ఈ అన్నమాట
నా పాలి ఏ వేళ శ్రీరామ రక్ష
ఏనాడు ఎటనున్న నను మరువకయ్యా
ఏనాడు ఎటనున్న నను మరువకయ్యా

కన్నయ్య పుట్టిన రోజునే
ఒక వేణువు పుట్టింది
ఒకరికొకరు ఏమైనా
రాగం పలికింది
అనురాగం పలికింది

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.