ఆదివారం, ఆగస్టు 30, 2020

నిన్న సంధ్య వేళ...

చిలిపి మొగుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిలిపిమొగుడు (1981)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, శైలజ 

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే

ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే 
తేనెల తేలించే ఎదలో రాగం పల్లవించే 
ఊహల వయ్యారం నన్నొక బొమ్మగ ఊగించే 
బొమ్మగ ఊగించే.. మ్మ్ఊహూహూ... ఆఆఆఆ..
ఆశలు పండించే నాలో యవ్వనమూరించే 

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే

పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే 
పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే 
పడచుదనం వగలై తెలిపే భావం పలకరించే 
అల్లరి నా మనసే చెలికి అల్లన విన్నవించే 
మోజులు వెన్నెలగా.. మోజులు వెన్నెలగా.. 
నిలిపే ఊహుహుఊహుహుహూ

నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే 
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే 
తలపే బంధము కోరెనులే.. 
 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.