మంగళవారం, ఆగస్టు 18, 2020

ఇది తైలం పెట్టి...

చంటి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు 
 
ఇది తైలం పెట్టి తాళం పట్టి 
తళాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి 
చేసే కొద్ది తమాషలే తీత

ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం
ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం

ఇది తైలం పెట్టి తాళం పట్టి 
తళాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ 

నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలు
నేను కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు
మమతల మారాజులులే ఈ అన్నలు
పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు

పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె
మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ
అహ ఏగాణైనా మాగాణైనా 
ఎంతో కొంత ఉండాలండి
ఉంది మనసుంది

ఇది తైలం పెట్టి తాళం పట్టి 
తళాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి 
చేసే కొద్ది తమాషలే తీత

ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం

ఇది తైలం పెట్టి తాళం పట్టి 
తళాంగుతో తలంటితే మోత ఆ ఆ ఓ ఓ

గుళ్ళోకి పోలేదు నేనెప్పుడూ
అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు
బళ్ళోకి పోలేదు చిన్నప్పుడూ
పల్లె పాఠాలే నేర్చాడు ఈ భీముడు

నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట
చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట
పలుకాకులలో పుట్టానండి 
కోకిలగా మారానండి
కాకా ఇది కూకూ

ఇది తైలం పెట్టి తాళం పట్టి 
తళాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి 
చేసే కొద్ది తమాషాలే తీత

ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం
ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం

ఇది తైలం పెట్టి తాళం పట్టి 
తళాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ
 

2 comments:

మా అందరికీ ఇష్టమైన పాట..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.